PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జి ఓ 117 రద్దు చేయాలి- కె ప్రకాష్ రావు రాష్ట్ర ఫాప్టో కో చైర్మన్

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  రాష్ట్ర ఫ్యాప్టో కార్యవర్గ పిలుపుమేరకు రాష్ట్ర ఫ్యాప్టో కో చైర్మన్ కే ప్రకాష్ రావు  నాయకత్వంలో కర్నూల్ రూరల్ మండలం మండల విద్యాధికారి కి మరియు అర్బన్  మండల విద్యాధికారి కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది .

ఇందులో

  1. జీవో 117 మరియు 128 ద్వారా కాకుండా 220 లో విడుదల చేసిన జీవో 53 ప్రకారం పని సర్దుబాటు చేయాలి. 2) పని సర్దుబాటు ప్రక్రియలో సీనియర్ కు వెల్డింగ్ అవకాశము కల్పించాలి. 3) పని సర్దుబాటు ప్రక్రియ మండల డివిజన్ సాయి వరకే పరిమితం చేయాలి 4) సమాంతర పాఠశాలలో ఉర్దూ తెలుగు తదితర పోస్టులను వర్కర్స్మెంట్ మినహించాలి 5) పని సర్దుబాటు చేయనప్పుడు ఉపాధ్యాయిని సొంత మేనేజ్మెంట్లో గల ఖాళీలలో భర్తీ చేసిన తర్వాతనే ఇతర మేనేజ్మెంట్లో నియమించాలి 6) 6 నుండి 10 తరగతులు పది సెక్షన్లు దాటిన సందర్భంలో రెండవ హిందీ రెండవ పిఎస్ పోస్టులను కేటాయించాలి 7) అవసరాన్ని బట్టి మాత్రమే మిగులు నిర్ణయించి సర్దుబాటు ప్రక్రియ చేయాలి. ఇంకను అనేక తప్పిదాలు ఉన్నందున సర్దుబాటు ప్రక్రియను తాత్కాలికంగా నిలుపుదల చేసి అన్నింటిని సవరించి తర్వాత సర్దుబాటు చేయగలరని రెప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. లేని పక్షంలో ఈ సర్దుబాటు కార్యక్రమం బహిష్కరిస్తామని తెలియ చేసారు. ఈ కార్యక్రమం లో స్ టి యు రాష్ట్ర నాయకుడు సుదీర్,కర్నూలు జిల్లా ఆప్టా ప్రధాన కార్యదర్శి సేవాలల్ నాయక్, శ్రీనివాస రెడ్డి ఎ పి టి ఎఫ్, జయరాజు యూటీఎఫ్ , సర్వేశ్వర రెడ్డి యు టి ఎఫ్, ఇబ్రహీం యు టి ఎఫ్, రామనాయక్ ఎం టి ఎఫ్ లక్ష్మా నాయక్ ఆప్టా,రాముడు ఎస్ టి యు  మరియు అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొనటం జరిగింది.

About Author