PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మనల్ని దేవుడు కరుణించలేదు..ప్రజలు కరుణించలేదు..

1 min read

-సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్యేకు నా కృతజ్ఞతలు

-ఓటమి అనేది ఎవ్వరికీ అర్థం కాదు కానీ వీటిపై విశ్లేషిస్తాం

-ఈ ఐదేళ్లపాటు ప్రజాక్షేత్రంలోనే మళ్ళీ పుంజుకుంటాం

-నందికొట్కూరు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ధార సుధీర్..

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నందికొట్కూరు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను పోటీ చేశా..ఎన్నికల సమయంలో ప్రతి ఇంటింటికి తిరిగా నన్ను మీ కుటుంబ సభ్యుడిగా ఆదరించారు మీరు నా పట్ల చూపిన ప్రేమ ఆదరాభిమానాలు వెలకట్టలేనివి..నియోజకవర్గ ప్రజలందరికీ నా జీవితాంతం రుణపడి ఉంటానని నంద్యాల జిల్లా నందికొట్టుకురు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త డాక్టర్ ధార సుధీర్ ఆదివారం నందికొట్కూరు పట్టణ వైసీపీ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు మరియు స్థానిక ఎమ్మెల్యే కు నా కృతజ్ఞతలు అని గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేశామని కానీ మనల్ని దేవుడు కరుణించలేదు..ప్రజలు కరుణించలేదు..ఇది నిజం ఒప్పుకోవాలని మన ఓటమికి ఎక్కడో ఒకచోట లోటు ఉందని మనం అధైర్య పడాల్సిన అవసరం లేదని ఈ ఓటమి లోటు పాట్ల ను కనుక్కోవాలి. దీనిపై విశ్లేషించాలి చర్చించుకోవాల్సిన అవసరం ఉందని గత ఐదేళ్ల మాదిరి ప్రజలతో ఏ విధంగా ఉన్నామో మనమంతా ఈ ఐదేళ్లపాటు ప్రజా క్షేత్రంలోనే ఉందామని గెలిచినప్పుడు ప్రజలకు సేవ చేయడం పెద్ద గొప్ప కాదని అధికారంలో లేనప్పుడే ప్రజలకు వెన్ను దన్నుగా ఉన్న నాయకుడే అసలైన నాయకుడని డాక్టర్ సుధీర్ అన్నారు.ఈ ఐదేళ్లపాటు ప్రజల్లోకి వెళ్తాం ప్రజా సమస్యల కోసం అహర్నిశలు కష్టపడతాం  ఈ ఎన్నికల్లో మనకు 81 వేల మంది ఓట్లు వేశారు వచ్చే ఎన్నికల్లో దాదాపుగా రెండు లక్షల ఓట్లు వచ్చే వరకు మనమంతా కష్టపడాలని డాక్టర్ ధార సుధీర్ అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ మున్సిపాలిటీ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి,జడ్పిటిసి పోచా జగదీశ్వర్ రెడ్డి,తువ్వా చిన్న మల్లారెడ్డి,పట్టణ అధ్యక్షులు మన్సూర్,నాగార్జున రెడ్డి, మిడుతూరు వైసీపీ మండల కన్వీనర్ తువ్వా లోకేశ్వర్ రెడ్డి,ఉస్మాన్ బేగ్ మరియు వివిధ గ్రామాల నాయకులు పాల్గొన్నారు.

About Author