PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గుండెపోటు వచ్చిన వారికి గోల్డెన్ అవర్ చాల కీలకం

1 min read

కిమ్స్ హాస్పిటల్ కర్నూలు అవగాహన సదస్సు

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: గుండెపోటు వచ్చిన రోగికి మొదటి గంట సమయాన్ని గోల్డెన్ అవర్ చాలా కీలకమైనదని అన్నారు కిమ్స్ హాస్పిటల్ అత్యవసర విభాగాధిపతి డా. వద్ది మురళీకృష్ణ. గత నెల నుంచి మూడు దశలుగా కిమ్స్ హాస్పిటల్ కర్నూలులో ఈ గోల్డెన్ అవర్ పై అవగాహన సదస్సులు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఈ సదస్సు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ (ఏహెచ్ఏ) ఆధ్వర్యంలో బేసిక్ లైఫ్ సపోర్ట్ (బిఎల్ఎస్, అడ్వాన్స్డ్ కార్డియాక్ లైఫ్ సపోర్ట్ (ఎసిఎల్ఎస్) కార్యక్రమం నిర్వమించామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోల్డెన్ అవర్లో అత్యవసరపు మెళకువలు పాటించడానికి ఇలాంటి అవగాహన సదస్సులు  ఎంతగానో ఉపయోగ పడతాయని తెలిపారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని ఆసుపత్రికి తరలించేలోపు కొన్ని చిన్న మెళుకువలు ద్వారా అత్యవసర స్థాయి ప్రథమ చికిత్స అందించి కాపాడవచ్చన్నారు. దీన్నే వైద్య పరిభాషలో బిఎల్ఎస్ అని అంటారన్నారు. బిఎల్ఎస్ ద్వారా ఒక నిండు ప్రాణాన్ని కాపాడ గలమన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగికి వీలైనంత త్వరగా సిపిఆర్ చేయాలన్నారు. ఇలా అవగాహనా సదస్సులు ఎంతో తోడ్పడు తాయని తెలిపారు. జిల్లాలోని వైద్యులకు, నర్సింగ్ స్టాఫ్ కు ఈ సదస్సు నిర్వహించడం జరిగిందని ఆయన తెలిపారు. రాబోయే రోజుల్లో ఇలాంటి మరెన్నో శిక్షణలు, నైపుణ్యాన్ని అందిస్తామన్నారు.  ఈ కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సుధాకర్, డాక్టర్ రఫీక్ అహ్మద్, యూనిట్ హెడ్ డాక్టర్ సునీల్ సేపూరి, ఆపరేషనల్ హెడ్ డాక్టర్ ధీరజ్, సహృదయ లీడ్   ఇన్ స్ట్రక్టర్ డాక్టర్ సునీల్ యాదవ్ టీవీ డాక్టర్ రాఘవ, డాక్టర్ నజీర్ తదితరులు పాల్గొన్నారు.

About Author