ప్రభుత్వ నిబంధనలు పాటించని గుడ్ బైస్ పాఠశాల గుర్తింపును రద్దు చేయాలి
1 min readపల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు : పట్టణంలో ఉన్నటువంటి గుడ్ బైస్ పాఠశాల ఫీజుల దోపిడీ అదేవిధంగా సిబిఎస్ అనే సిలబస్ తో విద్యార్థులు తల్లిదండ్రులను మోసం చేస్తున్నటువంటి గుడ్ బైస్ పాఠశాలను సీజ్ చేయాలని ఈరోజు ఎంఈఓ 2 గారికి వినుతపత్రాన్ని అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు నరసన్న డి ఎస్ వై ఏ జిల్లా అధ్యక్షుడు ఆర్ యు ఎస్ ఎఫ్ రఘు మాట్లాడుతూ సిబిఎస్ సిలబస్ పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులను ఆకర్షించి అడ్మిషన్స్ జాయిన్ చేసుకుని వేలకు వేలు ఫీజులు వసూలుచేసి అవినీతికి పాల్పడుతున్నారని అదేవిధంగా నర్సరీ విద్యార్థికి 30 వేల నుండి 35 వేల వరకు మీరు వసూలు చేయడం జరుగుతుందని అదేవిధంగా ఫీజులు కట్టే సమయంలో విద్యార్థి తల్లిదండ్రులకు ఎటువంటి రిసిప్ట్ ఇవ్వకుండా అటు విద్యార్థుల తల్లిదండ్రులను ఇటు ప్రభుత్వ న్ని మోసం చేయడం జరుగుతుందని.ఇవే కాకుండా స్నాక్స్ ఫీజ్ అని ఎగ్జామ్స్ ఫీజు అని ఇలా చెప్పుకుంటూ పోతే వేలకు వేలు వసూలు చేసివిద్యార్థుల తల్లిదండ్రులు నడ్డి విరవడం జరుగుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా విద్యాధికారులు స్పందించి ఆ పాఠశాల పైన విచారణ జరిపి పాఠశాలను సిజ్ చేయాలని వారు డిమాండ్ చేశారు.లేనిపక్షంలో ఈ సమస్య పైన విద్యార్థి సంఘాలుగా ఉద్యమాలను చేపడతామని వారు తెలియజేశారు. విద్యార్థి సంఘ నాయకులు రాజు రామాంజనేయులు కృష్ణ ఎల్లయ్య టైగర్ నాయకులు పాల్గొన్నారు.