ఈ నెల15న గోపూజ కార్యక్రమాలు
1 min readడాక్టర్ మల్లు వేంకటరెడ్డి, తితిదే
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఈనెల 15న కనుమ పండుగను పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో కర్నూలు నగరశివారులోని గోదాగోకులంలో వెలసిన శ్రీ గోదా రంగనాథ స్వామి దేవస్థానం నందు, నంద్యాల జిల్లా, మండలకేంద్రమైన మిడుతూరులోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానం నందు ఉదయం 10 గంటలకు గోపూజ, గో విశిష్టతపై ధార్మిక ప్రవచనాన్ని ఏర్పాటు చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకట రెడ్డి, గోదాగోకులం వ్యవస్థాపక అధ్యక్షులు మారం నాగరాజు గుప్త, ట్రస్టీ పల్లెర్ల నాగరాజు తెలిపారు. ఇందుకు సంబందించిన బ్యానరును స్థానిక గోదాగోకులం సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు రమేశ్ బట్టర్ ఆచార్యులు, యం.రాంభూపాల్ రెడ్డి, మాకం శ్రీనివాసులు, పి. వి. సుబ్రమణ్యం, పాలాది సుబ్రహ్మణ్యం, వేముల జనార్ధన్, పెరుమాళ్ళ బాల సుధాకర్, రాధాకృష్ణ, బచ్చు నాగ సురేశ్, వేముల ఎల్లయ్య, తరిగొండ వెంగమాంబ సేవాసమితి వ్యవస్థాపకులు పసుపులేటి నీలిమ తదితరులు పాల్గొన్నారు.