ఎమ్మెల్యేగా గెలిపించండి అభివృద్ధి ఏంటో చూపిస్తా…గౌరు చరిత రెడ్డి..
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల: గత ఐదు సంవత్సరాల వైసిపి పాలనలో పాణ్యం నియోజకవర్గం దోపిడి కబ్జాకోరుల హయంలో సర్వనాశనం చేశారని రాష్ట్రాన్ని ఆదాయం అభివృద్ధిలోకి తీసుకువెళ్లాలంటే టిడిపి పార్టీ అధికారంలో రావాల్సన అవసరం ఉందన్నారు సోమవారం నాడు గడివేముల మండల పరిధిలోని ఆళ్లగడ్డ. బుజనూరు గ్రంధి వేముల దుర్వేసి. కొరటమద్ది గ్రామాల్లో పాణ్యం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి గౌరు చరితా రెడ్డి రోడ్ షో నిర్వహించారు ఆమె మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలలో రాష్ట్రంలో ఉన్న ఆదాయ వనరులని వైకాపా నాయకులు దోచుకు తిన్నారని సెంటు భూమిని కూడా వదలలేదని ఆరోపించారు ప్రభుత్వ పథకాలలో అవినీతిని ప్రోత్సహించి జేబులు నింపుకున్నారని ప్రతి వర్గాలకు గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన సంక్షేమ పథకాలను కార్పొరేషన్లను నిర్వీర్యం చేశారన్నారు మహిళలకు పెద్దపీటవేసిన టిడిపి ప్రభుత్వాన్ని పథకాలను తీసివేసి రాక్షస ఆనందం పొందారని వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపాలన్నారు స్థానికంగా అలగనూరు రిజర్వాయర్ మరమ్మత్తు చేయకుండా ఐదు సంవత్సరాల నుండి పూర్తిస్థాయిలో పని రాకుండా చేశారన్నారు విద్యా వైద్యం వ్యవసాయ రంగం నిర్విరం చేశారన్నారు పాణ్యం నియోజకవర్గంలో మట్టి మాఫియా కబ్జా డబల్ రిజిస్ట్రేషన్లు అన్ని వ్యవస్థలను గుప్పిట పెట్టుకొని సామాన్యులను ఉద్యోగులను ఇబ్బంది పెట్టారన్నారు ధరలను పెంచి మధ్యతరగతి ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారు అన్నారు కరెంటు బిల్లు ముట్టుకుంటే షాకు కొడుతుందని మద్యపాన నిషేధం అంటూ సొంత బ్రాండ్లను మార్కెట్లో వదిలి అధిక ధరకు సారాను సీసాలో నింపి చూపులు నింపుకుంటున్నారని ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుకుంటున్నారని ఆరోపించారు . మళ్లీ ఏ ముఖం పెట్టుకొని వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఓట్లను అడుగుతున్నారని ప్రజలు అభివృద్ధిపై వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని నిలదీయాలన్నారు ఈసారి టిడిపి ప్రభుత్వం వస్తేనే సూపర్ సిక్స్ పథకాలతో మహిళలకు పెద్దపీట వేస్తూ ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు రైతులకు రైతు భరోసా కింద ఏడాదికి 25000 లబ్ధి చేకూరుస్తామన్నారు. యువతకు నెలకు 1500 వందలు భృతిగా ఇస్తామన్నారు డిగ్రీ చదువుకున్న యువతకు 3000. 18 సంవత్సరాలు నిండిన ఆడపడుచులకు 1500. పింఛన్లను పెంచి 4000 ఇస్తామన్నారు. మహిళలకు ఆర్టీసీ ప్రయాణం ఉచితంగా . ఇంట్లో మహిళలకు ఒక్కరికి సంవత్సరానికి తప్పకుండా మనము చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటే మన జీవితాలు బాగుపడతాయన్నారు మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే రాబోయే ఎలక్షన్లలో మీ అమూల్యమైన రెండు ఓట్లు కూడా నంద్యాల టిడిపి ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి . పాణ్యం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన తనకు సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి వేయించి గెలిపించాల్సిందిగా కోరారు . ఈ కార్యక్రమంలో మండల టిడిపి కన్వీనర్ దేశం సత్యనారాయణరెడ్డి. మాజీ ఎంపీపీ వంగాల శ్రీనివాస్ రెడ్డి. బి సీతారాంరెడ్డి. పంట రామచంద్ర రెడ్డి. మాజీ మండల ఉపాధ్యక్షుడు ఈశ్వర్ రెడ్డి. కత్తి శివారెడ్డి. బత్తుల సుభద్రమ్మ ఒడ్డు లక్ష్మీదేవి. బిఎస్ రాంభూపాల్ రెడ్డి. దుర్వేసి కిట్టు. భోజనం భాస్కర్ కృష్ణారెడ్డి హైమావతమ్మ. రమణ. రాచమల్లు శ్రీనివాసులు. కంది శ్రీను. భూపాల్. పి శ్రీను. నగరి వెంకటేశ్వర్లు తలారి రవి. ఎన్ శివశంకర్ . బివిఎన్ రాజు. గిరిబాబు యుగంధర్ రెడ్డి మురళీధర్ రెడ్డి.. ఎస్ ఎ రఫిక్ . ఎస్ఏ ఫరూక్. షేక్ వలి. ఎస్ ఏ ఖాలిద్. టిడిపి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.