ఏపీలో గవర్నన్స్.. ప్రపంచానికే రోల్ మోడల్
1 min readఏపీ ఆర్య వైశ్య కార్పొరేషన్ డైరెక్టర్, రాష్ట్ర పార్టీ కార్యదర్శి నంద్యాల నాగేంద్ర
- కర్నూలు, పల్లెవెలుగు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ఏపీలో పరిపాలన విధానం ప్రపంచానికే రోల్ మోడల్ గా మారుతోందన్నారు ఏపీ ఆర్య వైశ్య కార్పొరేషన్ డైరెక్టర్, రాష్ట్ర పార్టీ కార్యదర్శి నంద్యాల నాగేంద్ర. గతంలో ప్రజల వద్దకే పాలన తెచ్చామని గొప్పలు చెప్పుకున్న వైసిపి నాయకులు చిన్న సమస్యను కూడా పరిష్కరించలేకపోయారన్నారు. వినతులు, విజ్ఞప్తులు కార్యాలయాల నుంచి ప్రదక్షణలు తప్ప ప్రజలకు పని జరగ లేదన్నారు. ఇలాంటి ఎన్నో అంశాలు మంత్రి నారా లోకేష్ కు యువగళం పాదయాత్ర ద్వారా తెలిశాయన్నారు. అందుకే అప్పట్లోనే ఇలాంటి గవర్నెన్స్ తీసుకురావాలని ఆలోచించారన్నారు. దేశంలోనే తొలిసారిగా ఇలాంటి వాట్సప్ గవర్నెన్స్ తీసుకొచ్చారన్నారు. ఈ విధానం ద్వారా ప్రజల సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయన్నారు. తొలివిడతలో దేవాదాయ, విద్యుత్, ఆర్టీసీ , రెవెన్యూ, అన్నక్యాంటీన్, సీఎంఆర్ఎఫ్, మున్సిపాల్ శాఖల్లో 161సేవలు అందించనున్నట్టు చెప్పారు. దీని ద్వారా వేగంగా పౌరసేవలు, పారదర్శకత, జవాబుదారీతనంలో భాగంగా వాట్సాప్ గవర్నెన్స్ ఉపయోగపడుతుంది. రెండో విడతలో వాట్సాప్లో 360 సేవలను అందుబాటులో ఉంచుతారన్నారు. ప్రజలు గతంలోగా ఏదైనా సర్టిఫికెట్ కావాలంటే కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని వాట్సప్ గవర్నెన్స్ ద్వారా పొందవచ్చన్నారు. ప్రతి సర్టిఫికెట్ పైన క్యూఆర్ కోడ్ ఉంటుందని.. వాట్సాప్ గవర్నెన్స్ తో ఎక్కడా నకిలీకి ఆస్కారం ఉండదన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ సేవల్ని 9552300009 వాట్సాప్ నెంబర్ ద్వారా ప్రజలు పొందవచ్చ.