ఏపీలో… వాట్సప్ గవర్నెన్స్ సేవలు
1 min readజిల్లా ప్రజలు వినియోగించుకోండి..
- ఐటీడీపీ జిల్లా అధ్యక్షుడు గట్టు తిలక్
కర్నూలు, పల్లెవెలుగు:దేశంలోనే తొలిసారి ఆంధ్రప్రదే వాట్సాప్ గవర్నెన్స్ అనేది మొదలైందని మంత్రివర్యులు నారా లోకేష్ గురువారం వాట్సాప్ గవర్నెన్స్ ని ప్రారంభించారని అందులో భాగంగా తొలి విడతలో161 సేవలు ఉన్నాయని వాటిలో దేవాదాయ, విద్యుత్, ఆర్టీసీ, రెవెన్యూ ,అన్న క్యాంటీన్ ,సీఎంఆర్ఎఫ్ మున్సిపల్ శాఖల సేవలు ప్రజలు వినియోగించుకోవచ్చని ఐటీడీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు గట్టు తిలక్ తెలియజేశారు . రెండో విడతలో భాగంగా 360 సేవలను అందుబాటులోకి వస్తాయని వారు తెలియజేశారు. వాట్సాప్ అనేది ఈ కాలంలో ప్రతి ఒక్కరూ ఉపయోగిస్తున్నారని ప్రభుత్వం కేటాయించిన ఈ వాట్సాప్ నంబరుకి 9552300009 ఏ సర్టిఫికెట్ కావాలన్నా ప్రభుత్వ కార్యాలయ చుట్టూ తిరగకుండా ఈ నెంబర్ ద్వారా వాట్సాప్ గవర్నెన్స్ లో సులభంగా పొందచ్చని, అలాగే సులభంగా సమస్యలను కూడా పరిష్కరించుకోవచ్చని తిలక్ తెలియజేశారు. ఇందులో భాగంగా ప్రతి సర్టిఫికెట్ పైన క్యూఆర్ కోడ్ అనేది ఒకటి వస్తుందని, ఎక్కడా కూడా నకిలీ తయారు చేయడానికి ఆస్కారం లేకుండా రూపొందించారని ప్రభుత్వాన్ని కొనియాడారు ,అలాగే రానున్న రోజుల్లో వాట్సాప్ గవర్నెన్స్ రెండో విడతలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI )ను అనుసంధానం చేస్తూ మరింత అడ్వాన్సుడ్ గా తయారు చెయ్యబోతున్నారని ఆయన తెలియజేశారు.