రైతుల అభివృద్ధికి ప్రభుత్వం వివిధ పథకాలను అమలు చేస్తుంది
1 min readఉద్యాన పంటల కొరకు రైతులు రైతు సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తులు చేసుకోవాలి
ఉద్యాన శాఖ అధికారి రామ్మోహన్ రావు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఏలూరు జిల్లా పరిధిలో 2024-25 సంవత్సరంలో ఉద్యాన పంటల రైతుల అభివృద్ధి కొరకు ప్రభుత్వం వివిధ పధకాలను అమలు చేస్తోందని జిల్లా ఉధ్యాన శాఖ అధికారి రామ్మోహన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సంవత్సరములో (2024-25) ఉద్యాన పంటల అభివృద్ధి కొరకు ఏలూరు జిల్లాలో జాతీయ వంట నూనెల మిషన్ – ఆయిల్ పామ్ (NMEO-OP), సమీకృత ఉద్యాన అభివృద్ది మిషన్ (MIDH), రాష్ట్రీయ కృషి వికాస్ యోజన (RKVY), కొబ్బరి అభివృద్ధి బోర్డు (CDB) పధకాలు అమలులో ఉన్నాయన్నారు. ఇందుకు గాను కమీషనర్, ఉద్యాన శాఖ వారు సుమారు ఆయిల్ పామ్ సాగుకు (13500 హెక్టార్లు), MIDH & RKVY (1847 హెక్టార్లు) మరియు CDB పునరుద్దరణ పధకం క్రింద (125 హెక్టార్లు) లను లక్ష్యముగా ఇవ్వడం జరిగిందని చెప్పారు. ఆయిల్ పామ్ పధకం క్రింద మొక్కకు రూ.193/- చొప్పున హెక్టారుకు రూ.29000/- ప్రభుత్వ రాయితీ ఇవ్వడం జరుగుతుందని, అదే విధముగా MIDH & RKVY పధకాల క్రింద మామిడికి రూ.7980/- హెక్టారుకు, కోకో రూ.12000/- హెక్టారుకు, జీడి మామిడికి రూ.12000/- హెక్టారుకు, బత్తాయి / నిమ్మ రూ.9620/- హెక్టారుకు, డ్రాగన్ ఫ్రూట్ కి రూ.30000/- హెక్టారుకు, కూరగాయలు రూ.20000/-, నెలలో తేమను కాపాడుతూ కలుపు మొక్కల నివారణ కొరకు ప్లాస్టిక్ మాల్చింగ్ కవర్లు రూ.16000/- హెక్టారుకు మరియు RKVY – పందిర్ల సాగుకు రూ.250000/- రాయితీ ఇవ్వడం జరుగుతోందన్నారు. కావున ఏలూరు జిల్లాలోని ఉద్యాన రైతులు అందరు రైతు సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు మంజూరు చేసుకోవలసినదిగా తెలియచేసారు. దరఖాస్తుకు కావలసిన పత్రాలు – దరఖాస్తు ఫారం, ఆధార్ కార్డు, పట్టా దారు పాస్ పుస్తకం, బ్యాంకు పాస్ పుస్తకం, మొక్కలు కొనుగోలు చేసిన బిల్ లను రైతు సేవ కేంద్రాలలోని గ్రామ ఉద్యాన సహాయకులు లేదా ఉద్యాన అధికారులను సంప్రదించవలసినదిగా ఆయన తెలిపారు. గత సంవత్సరములలో రైతులకు రావలసిన రాయితీలను దశల వారిగా రైతుల బ్యాంకు ఖాతాలలో చేల్లించడం జరుగుతుందన్నారు. ఏడి మరియు ఉద్యాన శాఖ అధికారులు పాల్గొన్నారు.