గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
1 min read– జడ్పీ సీఈవో ఓబులమ్మ
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని జడ్పీ సీఈవో ఓబులమ్మ అన్నారు. ఈ సందర్భంగా ఆమె శుక్రవారం మండలంలోని కొక్కరాయపల్లి గ్రామంలో 13 లక్షల రూపాయలతో చేపట్టనున్న సిమెంట్ రోడ్డు పనులకు భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు, ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని, రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా తమ ప్రాంతాల అభివృద్ధికి సహకరించాలని ఆమె తెలిపారు. ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఎంతో ప్రాధాన్యత కల్పించడమే కాకుండా, అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా నెరవేర్చడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీ అభివృద్ధికి నిధులను కేటాయించడమే కాకుండా అక్కడ ఉన్న పనులు వేగవంతంగా చేపట్టడం జరుగుతుందన్నారు. వచ్చిన నిధులతో గ్రామ ప్రజలు, అధికారులు సమన్వయంతో పనులను నాణ్యతగా చేపట్టేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కిరణ్ మోహన్ రావు, టిడిపి నాయకులు కల్లూరు విజయభాస్కర్ రెడ్డి, సర్పంచ్ జ్యోతి, సుధాకర్ రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ ఉమామహేశ్వర్ రెడ్డి, పి ఆర్ ఏఈ మల్లికార్జున రావు కార్యదర్శి శివ కుమార్ రెడ్డి వాసుదేవ రెడ్డి, రాంప్రసాద్ , సూర్య, ఐసిడిఎస్, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.