నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రభుత్వ పిహెచ్సి వైద్యుల నిరసన
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (APPHCDA) వైద్యులు, G.O. 85కి వ్యతిరేకంగా తమ ఆందోళనను వ్యక్తం చేస్తూ,ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రైమరీ హెల్త్ సెంటర్స్ డాక్టర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు మంగళవారం పత్తికొండ డివిజియన్ డాక్టర్స్ అందరూ నల్ల బ్యాడ్జిలు ధరించి విధులు నిర్వహించారు. పుచ్చకాయలమాడ Phc డా అరుణ్ , డా నాగంబిక, కలొకేటెడ్ phc డా సుజాత డా కార్తిక్ ,తుగ్గలి phc డా ప్రవీణ్ కుమార్ డా ప్రతిమ , పగిడిరాయి డా హరిత మిణాజ్ , మద్దికెర phc డా శ్రీలక్ష్మీ డా రాగిణి , దేవనకొండ phc డా కళ్యాణ్ విజయ్ భాస్కర్, డా. అరుణ జ్యోతి నల్ల బ్యాడ్జీలు ధరించి విధులు నిర్వహించారు. వైద్యుల మాటల ప్రకారం, ఈ G.O. ద్వారా, తమ మూడేళ్ల సర్వీసు అర్ధం లేకుండా పోయిందన్నారు. ఇలా అకస్మాత్తుగా జీవోను మార్చడం అన్యాయం అని, తమ వృత్తి ప్రగతికి తీవ్ర నష్టం వాటిల్లుతోందని అన్నారు. గత రెండు నెలలుగా జీవో 85 రద్దు చేయమని అధికారులకు, శాసనసభ్యులకు అర్జీలు సమర్పించినప్పటికీ, ఇప్పటివరకు ఎటువంటి సమాధానం రాలేదని వైద్యులు నిరాశ వ్యక్తం చేశారు.COVID-19 సమయంలో మా జీవితాలను ప్రమాదంలో పెట్టి సేవలు అందించినప్పటికీ, ఇప్పుడు G.O. 85 ద్వారా పీజీ అవకాశాలు తగ్గించడం అన్యాయమని అన్నారు. ఇది ముఖ్యంగా గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో సేవలను ప్రభావితం చేస్తుందని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం జీవో 85ను ఒక సంవరించుకోవాలని వైద్యులు కోరారు.