పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి
1 min readమినుము కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి:సీపీఎం
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసినప్పటికీ మినుము పంట ఆశా జనకంగా వచ్చిందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్న తరుణంలో మినుము కొనుగోలు కేంద్రాలు లేక మధ్య దళారులకు అమ్ముకోవాల్సి వచ్చిందని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం నాగేశ్వరరావు, సీపీఎం నాయకులు పి పక్కిర్ సాహెబ్ అన్నారు.ఆదివారం మండలంలోని మల్యాల గ్రామంలో మినుము పంటను రైతు కోసిన పొలాన్ని వారు పరిశీలించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మినుము కొనుగోలు కేంద్రాలు ప్రభుత్వం ఏర్పాటు చేయకపోవడంతో రైతుల మధ్య దళారులకు తక్కువ ధర క్వింటా 3,500 కు అమ్ముకోవడం జరుగుతుంది దీని వల్ల రైతులు తీవ్ర నష్టాలకు గురౌతున్నారని పెట్టిన పెట్టుబడులు రావని రైతులు తీవ్రంగా నష్ట పోతున్నారన్నారు.కావున తక్షణమే మినుము కింటా 10 వేల రూపాయలు ప్రభుత్వం కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.రైతులు పండించిన పంటలను నేరుగా ప్రభుత్వం మినుము కొనుగోలు అమ్ముకునే విధంగా చర్యలు చేపట్టాలని వారు అన్నారు.ప్రభుత్వం నష్టపోతున్న రైతాంగాన్ని ఆదుకునేందుకు మినుము ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు.లేని పక్షంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మినుము రైతులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో రైతులు జయన్న,మధు,శ్రీనివాసులు, చిన్న,రఫీ,రమేష్,రవి యాదవ్ పాల్గొన్నారు.