ఘనంగా మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు..
1 min readపల్లెవెలుగు వెబ్ మిడుతూరు (నందికొట్కూరు): నంద్యాల జిల్లా మిడుతూరు మండలం చౌటుకూరు గ్రామంలో ఎస్సీ కాలనీ మాదిగ పేటలో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ 59 వ జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టిడిపి గ్రామ నాయకులు నరసింహ గౌడ్,షబ్బు,ఎల్లారెడ్డి వాటర్ అబ్దుల్లా మరియు టిడిపి జనసేన కార్యకర్తలు హాజరై కేకు కట్ చేసి ప్రజలకు పంచి పెట్టారు ఈ సందర్భంగా నరసింహ గౌడ్ మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ సామాజికంగా సోషలిజంగా, ఎన్నో ఉద్యమాలు చేసి బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండి బహుజనుల యొక్క, సమస్యల నిమిత్తమై పోరాటాలు చేస్తూ నిస్వార్ధంగా ఏ పార్టీకి తల ఒగ్గకుండా ప్రభుత్వాలు పదవులు ఇచ్చినా కూడా తీసుకోకుండా సామాజిక న్యాయం కోసం పోరాటం చేసి ఈ మధ్యనే దివ్యాంగులకు 6 వేలు పింఛన్ ఇవ్వవలసిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు ను ఆయన కోరారని కృష్ణన్న గూర్చి చక్కగా వర్ణించారు.అదేవిధంగా షెబ్బు, మాట్లాడుతూ అనేక సంవత్సరాల క్రితమే గుండె జబ్బుల పిల్లలను నిమిత్తమై, రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోరాటం చేసి ఎన్నో సమస్యలు ఎదుర్కొని గుండెజబ్బు పిల్లలకు ఆపరేషన్ చేయించడం ఈరోజు ఆరోగ్యశ్రీ వచ్చిందంటే ఇది నేను చెప్పడం కాదు స్వయానా వైయస్ రాజశేఖర్ రెడ్డి అసెంబ్లీలో పలికారు అది మంద కృష్ణ యొక్క ప్రభావమే అని కాబట్టి ఇలాంటి త్యాగ పురుషుల యొక్క జన్మదినాన్ని మనం జరుపుకోవడం ఎంతో సంతోషకరంగా ఉంది మందకృష్ణ మాదిగ ఎన్నో ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆయనకు మంచి దేవుడు ఆయురారోగ్యం దయచేయాలని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాయలసీమ అధ్యక్షుడు గూడెం సామన్న, మండల ఉపాధ్యక్షులు చిన్న హుస్సేన్,మండల అధ్యక్షులు గూడెం ఆనంద్,గంధం సామ్యూల్ గంధం కరుణాకర్ పాల్గొన్నారు.