PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా ఎమ్మెల్యే తనయుడు పుట్టినరోజు వేడుకలు

1 min read

పల్లెవెలుగు వెబ్ కడప సిద్ధవటం : ఎమ్మెల్యే తనయుడు నియోజకవర్గ యువ నాయకుడు ఆకే పాటి సాయి భరత్ రెడ్డి జన్మదిన వేడుకలను సిద్ధవటం వైఎస్ఆర్సిపి నాయకులు మండల బూత్ ఇన్చార్జి సింగం ఆనంద రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ జన్మదిన వేడుకలకు మండల వ్యాప్తంగా వైఎస్ఆర్సిపి కార్యకర్తలు, నాయకులు అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈ సందర్భంగా సింగం ఆనంద్ రెడ్డి మాట్లాడుతూ, మన  యువ నాయకుడు ఆకేపాటి సాయి భరత్ రెడ్డి వేడుకలను వైఎస్ఆర్సిపి అభిమానుల, కార్యకర్తల, నాయకుల మధ్య ఘనంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఆకేపాటి సాయి భరత్ రెడ్డి మండల అభివృద్ధికి ఎంతో సహాయ సహ కారాలు అందించడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా ప్రతి కార్యకర్తకు తాను అండగా ఉన్నానంటూ భరోసా కల్పించడం జరుగుతుందన్నారు. ఆయన భరోసాతో కార్యకర్తలలో నాయకులలో నూతన ఉత్తేజం వచ్చిందని తెలిపారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు మరింత సేవలు అందించాలని ఆయన ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అల్లూరు శివారెడ్డి, కుప్పం సుబ్బారెడ్డి , ఎలుగుపల్లె సుబ్బారెడ్డి, మేకల కృష్ణారెడ్డి, వైయస్సార్సీపి నాయకులు ,కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

About Author