ఘనంగా శ్రీమతి వైయస్ షర్మిల జన్మదిన వేడుకలు..
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద : ఆలూరు నియోజకవర్గం హోలగుంద మండలం హెబ్బటం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అమానుల్లా ఆధ్వర్యంలో ఏపీ పీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ షర్మిల రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆలూరు కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ వర్యులు చిప్పగిరి లక్ష్మీనారాయణ . ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రామాంజనేయులు, మాజీ మండల అధ్యక్షులు డేగులపాడు మంజునాథ్, కరెంటు గోవిందు, వరకుమార్, తిమ్మప్ప, నవీన్, వెంకటేష్, గిరి, వీరాంజనేయులు, రాజేష్, కురుకుంద రాజు, పక్కీరప్ప మంగయ్య తదితరులు పాల్గొన్నారు పాల్గొన్నారు.