ఘనంగా నారా లోకేష్ పుట్టిన రోజు వేడుకలు..
1 min readపశువులకు మందులు వేసిన సురేంద్రనాథ్ రెడ్డి
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: రాష్ట్ర విద్యాశాఖ మరియు మానవ వనరుల అభివృద్ధి, ఐటీ,ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్,రియల్ టైం గవర్నెన్స్ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.నంద్యాల జిల్లా నందికొట్కూరు మండల పరిధిలోని అల్లూరు గ్రామంలో గురువారం ఉదయం మాండ్ర శివానందరెడ్డి స్వగృహంలో నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య మరియు మాండ్ర లింగారెడ్డి,మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు జరిగాయి. కేక్ కట్ చేసి ఒకరినొకరు సంతోషంగా కేకును పంచుకుంటూ సంబరాలు చేసుకున్నారు.రాష్ట్రాన్ని అభివృద్ధి నడిపేందుకు నారా లోకేష్ అవసరం ఎంతో ఉందని అదేవిధంగా రాబోయే రోజుల్లో రాష్ట్రానికి ఆయన సేవలు అవసరమని ఎమ్మెల్యే కొనియాడారు.అదే విధంగా అల్లూరు గ్రామంలో పశు వైద్య శిబిరం నిర్వహించారు.ఈ వైద్య శిబిరంలో పశువులకు మాండ్ర సురేంద్ర నాథరెడ్డి మందులు వేశారు.పశువులకు వచ్చేటువంటి జబ్బుల గురించి జాగ్రత్తగా ఉండాలని ఆయన రైతులకు సూచించారు.ఈ కార్యక్రమంలో నందికొట్కూరు పట్టణ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ మొల్ల రబ్బానీ,మాజీ ఎంపీపీ వీరం ప్రసాద్ రెడ్డి,కాతా రమేష్ రెడ్డి,పలుచాని మహేశ్వర్ రెడ్డి,కౌన్సిలర్లు జాకీర్ హుస్సేన్,భాస్కర్ రెడ్డి, ముర్తు జావలి,గ్రామ సర్పంచ్ చిన్న నాగ లక్ష్మయ్య, సున్నంపల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు.