PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా రాహుల్ గాంధీ  జన్మదిన వేడుకలు

1 min read

పల్లెవెలుగ వెబ్ కర్నూలు: కర్నూలు నగరంలోని జి.పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో ఉన్న అమ్మ అనాధ ఆశ్రమం నందు కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు, పార్లమెంట్ సభ్యులు శ్రీ రాహుల్ గాంధీ  జన్మదినం సందర్బంగా అనాధ ఆశ్రమంలోని పిల్లల సమక్షంలో కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కె.బాబురావు  సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కోడుమూరు నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మాజీ టీటీడీ పాలకమండలి సభ్యులు  పి మురళీకృష్ణ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ  జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ముందుగా నాయకులు అనాధ ఆశ్రమంలో పిల్లల సమక్షంలో కేక్ కట్ చేసి అనంతరం పిల్లందరికీ నోట్ బుక్కులు పెన్నులు పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో అమ్మ అనాధాశ్రమం నిర్వాహకులు సతీష్  కాంగ్రెస్ ఎసి సెల్ జిల్లా చైర్మన్ ఈ లాజరస్, పసుపల ప్రతాపరెడ్డి, సాయి, తిప్ప నాయుడు, లక్ష్మణ్ గౌడ్, మధు మొదలగు వారు పాల్గొన్నారు.

About Author