ఘనంగా విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకలు..
1 min readపల్లెవెలుగు వెబ్ మిడుతూరు (నందికొట్కూరు): నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రంలో విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎంపీపీ మెయిన్ పాఠశాలలోని భవిత కేంద్రం నందు పాఠశాల హెచ్ఎం శాంతి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి మండల విద్యాశాఖ అధికారి-2 శ్రీనాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారులకు అందిస్తున్న సేవలను తల్లిదండ్రులు తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోవాలన్నారు.దివ్యాంగ చిన్నారులను తప్పకుండా పాఠశాలలో చేర్పించాలని వారి అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ప్రభుత్వం దివ్యాంగ చిన్నారుల సంక్షేమం కోసం దివ్యాంగుల నూతన చట్టం ప్రకారం ఉద్యోగాల భర్తీలో నాలుగు శాతం రిజర్వేషన్,విద్యా అవకాశాలలో ఐదు శాతం రిజర్వేషన్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం అయినదని తెలియజేశారు.దివ్యాంగ చిన్నారుల తల్లిదండ్రులు వారి అభ్యున్నతికి కృషి చేస్తూ వారికి మంచి భవిష్యత్తును అందజేసేందుకు కృషి చేయాల్సిన ఆవశ్యకతను వివరించారు.ప్రతి మంగళవారం మండలంలో నిర్వహించే ఫిజియోథెరపీ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.అనంతరం విద్యార్థులచే ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. చిన్నారులకు ఏర్పాటు చేసిన పాటల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు.ఈ కార్యక్రమంలో భవిత పాఠశాల సహిత విద్య ఉపాధ్యాయులు షహనాజ్, మియాభాష,ఐడిఎస్ఎస్ ఉపాధ్యాయులు రమణ, ఫిజియోథెరపీ వైద్యులు శ్రీధర్, భవిత సిబ్బంది రమాదేవి, దివ్యాంగ చిన్నారుల తల్లిదండ్రులు,విద్యార్థులు పాల్గొన్నారు.