ఘనంగా శ్రీ మడివేల మాచిదేవ జయంతి వేడుకలు
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద: హోళగుంద మండల రజక సంఘం ఆధ్వర్యంలో ఉత్సాహభరితంగా జరిగింది. బారతీయ పురాణాలు మడేలయ్య తన యొక్క పాపపరిహారం తీర్చుకోవటానికి సుర ముప్పది మూడు కోట్ల దేవతలు మునులు విడిచిన వస్త్రాలను 12 సంవత్సరాలు శుద్ధి చేస్తాడు. ఒక రోజున శివుడు మడేలయ్య వృత్తిని పరీక్షించేందుకు తన పులి చర్మంతోపాటు తాను కప్పుకునే బొంతను పిండ మని కోరుతాడు. ఆ బొంత 33 గజాల పొడవుతో అందులో చీర పేన్లు, నల్లులు 101 జంతువులు ఉన్నాయని వాటిని చావకుండా పిండటం నీ తరం కాదని చెప్తాడు. అయినప్పటికీ మడేలయ్య పిండు తానని బయలుదేరుతాడు. అప్పుడు మడేలయ్య ఏనుగు మీద బొంతను వేసుకొని నీటి కోసం లోకాలన్నీ తిరిగినా కనిపించవు. ఎందుకంటే అప్పటికే పరమ శివుడు నీటిని మాయం చేస్తాడు. అప్పుడు శీతలాదేవి పరమశివుడు పెట్టిన పరీక్షను ఎలాగైనా నెగ్గాలని మన వృత్తి ధర్మాన్ని పాటించాలని మడేలయ్యతో నన్ను సంహరించి నా అవయవాలతో బొంతను పిండి పరమశివుని కోరిక తీర్చాలని కోరుతుంది. అప్పుడు మడేలయ్య శీతలా దేవి కన్నీరు పోకుండా కట్టకట్టి నీరుగాను, కనుగుడ్లు తీసి ఉడకబెట్టే కడువలుగాను, చనుబాలను పొయ్యి రాళ్ల గాను, ఆమె ఇరవై వేళ్లు కొట్టి వంటచెరకు గాను, నరములు తీసి గాలి తాళ్లుగాను,చర్మాన్ని వడ కోక గాను, రక్తం తీసి చౌడు గాను, శీతలాదేవి డొక్కను బానగాను, కడుపుల అన్నం సున్నంగాను చేసి శివుని బొంత పిండుతాడు. అలాగే అప్పుడే ఆమె పేగులను తీసి చెరువు మీద వేయగా తూటికూరగా మొలుస్తాయి. రజకులు ఇప్పటికీ తూటికూర తినకపోవడాని కి కారణంగా ఇదే చెబుతారు. మడేలయ్య శివుని బొంత పిండిన తర్వాత శివుని కొరకు వెతుకుతుండగా ఎక్కడ శివుడు కనిపించడు. దారిలో ఒక కుష్టి వ్యాధిగ్రస్తుడు మడేలయ్యను ‘ఎవరి కోసం వెతుకుతున్నావని’ అడుగుతాడు. అతను శివుని గురించి అని చెప్పగా అయితే ‘నన్ను నీ భుజాలమీద ఎక్కించుకొని తీసుకుపోతే, నేను శివున్ని చూపిస్తా’ అంటాడు. ఆలా అతన్ని భుజాలమీద ఎక్కించుకొని వెళ్తుండగా ఉన్నట్టుండి అతను బరువు పెరిగి పోతాడు. అప్పుడు మడేలయ్య అతని బరువు మోయలేక కిందకు దించుతాడు వెంటనే అతను మాయమైపోతాడు అంతలో ఎదురుగా వస్తున్నా వ్యక్తి మడేలయ్య తో నువ్వు నీ భార్య వెళ్లారు వచ్చేటప్పుడు ఒక్కడివే వస్తున్నవేంటని అడుగుతాడు అప్పుడు మడేలయ్య జరిగిన విషయమొత్తం చెప్తుండగా అతను ఒకసారి వెనక్కి తిరిగి చూడమన్నాడు …. అతను వెనక్కి తిరిగి చూడగానే శీతలా దేవి కనిపిస్తుంది.ఈ కార్యక్రమంలో కురుకుంద నాగరాజు.మంగయ్య.లక్ష్మణ lic.మల్లికార్జున.నాగరాజు.శివకరెంటు మల్లికార్జున.ఎల్లప్ప .నాగేంద్ర. రమేష్.రాజ.గదిలింగా.యస్వాత్. రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.