ఘనంగా జర్నలిస్టుల ఐక్య సెమీక్రిస్మస్ వేడుకలు
1 min readముఖ్య అతిథిగా పాల్గొని క్రిస్మస్ సందేశం అందించిన రెవరెండ్ ఫాదర్ ఇంజమాల మైఖేల్
వేడుకలో కులమతాలకు, యూనియన్లకు,అతీతంగా పాల్గొన్న జర్నలిస్టులు
జర్నలిస్టులు అందరూ కలిసి కట్ చేసిన క్రిస్మస్ కేక్
క్రిస్మస్ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన చిన్నారుల నృత్యాలు
ఫాదర్ ఇంజమాల మైఖేల్ సత్కరించిన జర్నలిస్టులు
పలువురు జర్నలిస్టులకు దృశ్యాలువతో సత్కారం
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి: ఏలూరు సిటీ, స్థానిక లేడీస్ క్లబ్ ఆవరణంలో ఏలూరు జర్నలిస్టులు ఆధ్వర్యంలో సభాధ్యక్షులు మత్తే బాబి అధ్యక్షతన నిర్వహించిన జర్నలిస్టుల ఐక్య సెమీక్రిస్మస్ వేడుకలు అంబరాన్ని తాకాయి, ముందుగా ప్రముఖ క్రైస్తవ గాయకులు జంగం సురేష్ స్టీఫెన్ క్రిస్మస్ గేయాలు ఆలపించారు,ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా రెవరెండ్ ఫాదర్ ఇంజమాల మైఖేల్ పాల్గొని క్రిస్మస్ సందేశాన్ని అందించారు. ఈ సందర్భంగా ఫాదర్ మాట్లాడుతూ జర్నలిస్టులు రాత్రనక పగలనక వేయ ప్రాసల కోర్చి తమ వృత్తిని కొనసాగిస్తుంటారని, సమాజాన్ని జాగృతం చేయడంలో జర్నలిస్టుల పాత్ర అభినందనీయమని. ఒక కత్తి ఎంత పొదునైనదో జర్నలిస్ట్ చేతిలో పెన్ను కూడా అంతే పదునైనదని వారు రాసే రాతల ద్వారా సమాజం మేల్కొంటుందని కొనియాడారు.అనంతరం సీనియర్ జర్నలిస్ట్ రాజు మాట్లాడుతూ జర్నలిస్ట్ అందరూ సమైక్యంగా కలిసి సెమి క్రిస్మస్ జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు,పాస్టర్ గేరా అబ్రహ్మం,కైలే జోసెఫ్ క్రిస్మస్ శుభాలు తెలిపారు,అనంతరం ఈ వేడుకలో కొవ్వలి, పోతునూరు,నవాబుపేటకు,చెందిన పలువురు చిన్నారులు క్రిస్మస్ గీతాలు నృత్యాలు చేసి అలరించారు,అనంతరం సీనియర్ జర్నలిస్టులుకు చిరు సత్కారం చేశారు. ఈ సెమీక్రిస్మస్ నిర్వహణకు సహకరించిన ఆర్గనైజర్ గుంపుల విక్టర్ బాబు ను పలువురు అభినందించారు,ఈ కార్యక్రమంలో ఏలూరు దెందులూరు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, శాటిలైట్ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్, జర్నలిస్టులు కులమతాలకు యూనియన్లకు అతీతంగా పాల్గొన్నారు.