PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బదిలీపై వెళ్తున్న ఎస్సై కి పాత్రికేయుల ఘన వీడ్కోలు..

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల:  గడివేముల ఎస్సైగా గత రెండు సంవత్సరాల మూడు నెలలు విధులు నిర్వహించిన బీటీ వెంకటసుబ్బయ్య బదిలీల్లో భాగంగా బనగానపల్లి నియోజకవర్గం నందివర్గం పోలీస్ స్టేషన్ కు బదిలీ అయ్యారు దీంతో శనివారం నాడు స్టేషన్లో రిలీవ్ అయ్యారు ఈ సందర్భంగా గడివేముల మండల పాత్రికేయ మిత్రులు పూలమాలలు వేసి  ఎస్సై కు ఘన వీడ్కోలు  పలికారు . ఈ సందర్భంగా ఎస్సై బీటీ వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ పాత్రికేయ మిత్రుల సహకారం మరువలేనిదని విధులు నిర్వహించడంలో తనకు సహకరించిన గడివేముల మండల ప్రజలు నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రభ  మహబూబ్ బాషా. ప్రజాశక్తి ఎల్లసుబ్బయ్య. ఆంధ్రజ్యోతి మల్లికార్జున్ నాయుడు. సాక్షి సోఫీ సాహెబ్. సూర్య మహమ్మద్ సలేహ. మహబూబ్ బాషా పల్లె వెలుగు. పాత్రికేయ బృందం పాల్గొన్నారు .

About Author