జిల్లా ఖజానా కార్యాలయం లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
1 min readమంత్రి కొలుసు పార్థసారథి చేతుల మీదుగా ఖజానా శాఖ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు
జాతీయ జెండాను ఎగరవేసిన జిల్లా ఖజానా అధికారి టి కృష్ణ
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ సర్వీసెస్ అసోసియేషన్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వారి ఆధ్వర్యంలో జిల్లా ఖజానా కార్యాలయం ఏలూరు లో 78 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి జిల్లా ఖజానాధికారి టి.కృష్ట ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కృష్ణ మాట్లాడుతూ ప్రస్తుతం మనుషులు అందరూ కక్షలతో, అసూయ -ద్వేషాలు ఆదిపత్య దోరణి తో ఉంటున్నారని మన పొరుగున ఉన్న ఆసియా దేశాలు అయిన ఇజ్రాయెల్, పాలస్తీనా , లెబనాన్, బంగ్లాదేశ్ లలో మతోన్మాద, ఆదిపత్య దోరణి తో అమాయక ప్రజలు , ముక్కు పచ్చలారని పసి పిల్లలు ప్రాణాలను బలికొని వారి బంగారు భవిష్యత్తు ను నాశనం చేస్తున్నాయన్నరు. మనం అందరం కూడా తన,మన,కులమత బేదం లేకుండా కలిసి ఉన్నప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందఅన్నరు. అప్పుడు మాత్రమే స్వాతంత్ర్య ఫలాలు అట్టడుగు వర్గాలకు కూడా చేరతాయనరు.ఈ సందర్భంగా జిల్లా సెక్రటరీ కప్పల సత్యనారాయణ మాట్లాడుతూ ఎందరో త్యాగమూర్తుల త్యాగ ఫలమే మనం నేడు అనుభవిస్తున్న స్వాతంత్ర్య అని 78 సంవత్సరాల గడిచినా ఇంకా దేశం అనేక సమస్యలు ఎదుర్కొంటుందని ఈ సమస్యలు పరిష్కారం అవ్వాలంటే రాజ్యాంగ మౌలిక విలువలను అందరూ గౌరవించాలి అని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉత్తమ ఉద్యోగులుగా జిల్లా ఇన్చార్జ్ మంత్రి, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి చేతుల మీదుగా ఉత్తమ ఉద్యోగులుగా ప్రశంసా పత్రం అందుకున్న ఖజానా సహాయ అధికారి పందిరి ప్రేమావతి ని జిల్లా ఖజానా శాఖ ఉద్యోగులందరూ ప్రత్యేకంగా అభినందించారు. అదే విధంగా ఏలూరు సబ్ ట్రెజరీ స్వరాజ్యలక్ష్మి కి, జంగారెడ్డిగూడెం రాజేష్ కి, నూజివీడు వెంకట్ కి, జిల్లా ఖజానా కేంద్రం నుండి పి లలిత కుమారికి అవార్డు పొందిన వారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం లో జిల్లా ట్రెజరర్ నెరుసు గణేశ్వరరావు,జిల్లా ఖజానా శాఖ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.