PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా జిందాల్ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు..

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల: మండల పరిధిలోని బిలకల గూడూరు గ్రామ సమీపాన వెలసిన  శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు గురువారం నాడు అత్యంత వైభవంగా జరిగాయి ఈ కార్యక్రమానికి జిందాల్ యాజమాన్యం భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు ప్లాంట్ హెడ్. నవనీత్ చౌహన్. హెచ్ఆర్ హెడ్ వినీత్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ ఉత్సవాలలో భక్తులు విరివిగా పాల్గొని  విజయవంతం చేశారు ఉదయం 8 గంటలకు పూర్ణహ కలశ స్థాపన అగ్ని ప్రతిష్ట,సుదర్శన హోమం, పూర్ణాతి కార్యక్రమాలు జరిగాయి .అలాగే 11 గంటల సమయంలో అభిషేకం అలంకార నివేదిన హారతి, మంత్రపుష్పం, తీర్థ ప్రసాద వినియోగం కార్యక్రమాలు నిర్వహించారు స్వామివారిని దర్శించుకోవడానికి జిల్లా నలుమూలల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు .. అనంతరం స్వామివారి పల్లకి సేవ నిర్వహించారు వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సెక్యూరిటీ సిబ్బంది సిఎస్ఆర్ మేనేజర్ రవికుమార్ ఆధ్వర్యంలో సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భక్తాదులు అశేషంగా పాల్గొని విజయవంతం చేయడంతో నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు .

About Author