ఘనంగా జూనియర్ కళాశాల వేడుకలు..
1 min readఅలరించిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు (నందికొట్కూరు): నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కళాశాల ప్రిన్సిపాల్ శంకర్ నాయక్ ఆధ్వర్యంలో గురువారం కళాశాలలో వేడుకలు (కాలేజీ డే) ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ మండల కన్వీనర్ కాతా రమేష్ రెడ్డి మరియు నాయకులు హాజరయ్యారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ గతంలో కళాశాలలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండేదని ఇప్పుడు విద్యార్థుల సంఖ్య అధికంగా ఉందని అంతే కాకుండా మండలంలోని వివిధ గ్రామాల నుంచి విద్యార్థులు ఇక్కడ ఇంటర్ లో చేరే విధంగా చూడాలని నాయకులను కోరారు. విద్యార్థులు ఒక లక్ష్యంతో చదువుకొని ముందుకు వెళ్తే మీరు అనుకున్న లక్ష్యాన్ని చేదిస్తారని ఆయన విద్యార్థులకు సూచించారు.తర్వాత మంచిగా చదువుకొని తల్లి దండ్రులకు కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని అదే విధంగా ప్రతి ఒక్కరూ పట్టుదలతో చదివినట్లయితే మీరు జీవితంలో ఒక స్థాయిలో ఉంటారని విద్యార్థులకు కాత రమేష్ రెడ్డి సూచించారు.అంతే కాకుండా కళాశాల అభివృద్ధికి తమ వంతుగా కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.వివిధ ఆటల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు మెమెంటోలు మరియు బహుమతులను అందజేశారు.చివరగా కళాశాల విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు చాలా చక్కగా చేశారు.ఈ కార్యక్రమంలో కళాశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ శ్రీనాథ్ రెడ్డి,వైస్ ప్రిన్సిపాల్ ప్రభాకర్ నాయకులు తువ్వా భగీరథ రెడ్డి,వెంకటేశ్వర రెడ్డి,గుండం హరి సర్వోత్తమ రెడ్డి, రమణారెడ్డి,షబ్బు, సుధాకర్ యాదవ్, నరసింహ గౌడ్, సుధాకర్ రెడ్డి,ఇద్రిస్ మరియు అధ్యాపకులు ఎల్లన్న,సీతారాముడు, తిరుమలేశ్వర రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, విసాలాక్షి మరియు విద్యార్థులు పాల్గొన్నారు.