ఘనంగా కురువల కార్తీక వనభోజనం..
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు జిల్లా కురువ సంఘం.ఆధ్వర్యంలో పెద్దపాడు రోడ్ లోని బీరప్ప స్వామి దేవాలయం నందు 22వ కార్తీక వనభోజనం అధిక సంఖ్యలో కులస్థులు పాల్గొన్నారు. ముఖ్యఅతిథిగా కర్నూల్ పార్లమెంటు సభ్యుడు బస్తిపాటి నాగరాజు పాల్గొని ఉసిరి చెట్టు దగ్గర పూజలు నిర్వహించి జ్యోతి ప్రజ్వలన కనకదాసు విగ్రహానికి పూలమాలతో సభ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రధాన కార్యదర్శిఎం. కె.రంగస్వామి అధ్యక్షతన జరిగింది కురువ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుడిసె శివన్న జిల్లా అధ్యక్షులు పత్తికొండ శ్రీనివాసులు గొర్రెల సంఘం చైర్మన్ శ్రీనివాసులు ఘనంగా సన్మానించారు. ఎంపీ బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ జిల్లాలోని కురువ కులస్థులకు నేను రుణపడి ఉన్నాను అని, నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు పేరుపేరున జిల్లా ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. శ్రీశైలం సత్రం కర్నూలు జిల్లా కురువ సంఘము ఆధ్వర్యంలో నడిపేందుకు నా సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని, భీర లింగేశ్వర దేవాలయంనకు వచ్చే కార్తీక వనభోజనాలకు అన్ని హంగులతో పూర్తిగా సహకారం అందిస్తానని ఎంపీ బస్తిపాటి నాగరాజు హామీ ఇచ్చారు. అలాగే జిల్లాలోనే ఏ సమస్య వచ్చినా తనని ఎల్లప్పుడూ సంప్రదించవచ్చని నా యొక్క సహకారం పూర్తిస్థాయిలో ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షుడు గడ్డం రామకృష్ణ, సత్యనారాయణమ్మ, అరుణకుమారి, డిప్యూటీ కలెక్టర్ మల్లికార్జున, కల్లూరు మండల తహసీల్దార్ కె.ఆంజనేయులు నాయకులుసిపిఐ నాయకులు జగనాతం,రాజశేఖర్,భాను శంకర్,, పెద్దపాడు ధనుంజయ,కొత్తపల్లి దేవేంద్ర, తవుడు శ్రీనివాసులు,కె సి నాగన్న కత్తి శంకర్,తిరుపాల్, శ్రీ లీలమ్మ, అనితమ్మ, బూదర్ లక్ష్మన్న, శివరాం తదితరులు పాల్గొన్నారు.