ఘనంగా ఏలూరు జిల్లాలో ఓపెన్ చెస్ ఫెస్టివల్
1 min readగురువులు నేర్పిన మేళ్లుకువలు నేర్చుకోవాలలి భవిష్యత్తులో ఉన్నతంగా ఎదగాలి
టెస్లా సాఫ్ట్ వేర్ ఇంజినీర్ జి కార్తీక
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : స్థానిక బచ్ పాన్ స్కూల్ శాంతినగర్ ఏడవ రోజులో అబ్రహం అండ్ గ్యారి కాస్పరోవ్ చేస్ అకాడమీ ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా ఓపెన్ చెస్ ఫెస్టివల్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చిన టెస్లా సాఫ్ట్ వేర్ ఇంజినీర్ జి కార్తిక మాట్లాడుతూ విద్యార్థులు శ్రద్ధగా గురువులు నేర్పిన మెళ్లుకువలు నేర్చుకోవాలని గురువులకు, తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతలు తేవాలని భవిష్యత్తులో ఉన్నతంగా ఎదగాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అకాడమీ డైరెక్టర్ జి. యోహనన్, అధ్యాపకులు, తల్లిదండ్రులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.