ఘనంగా సంక్రాంతి సంబరాలు
1 min readముగ్గులతో పండగ వాతావరణం
పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం: తెలుగు వారి సాంప్రదాయ పండగ సంక్రాంతి పండుగ సంబరాలు మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు, యువతులు తెల్లవారుజామున నుండి తమ తమ ఇళ్ల ముందు రంగు రంగుల ముగ్గులు వేయడం తో పండగ వాతావరణం నెలకొంది. వివిధ రకాల కొన్ని ముగ్గులు చాలా మంది కి ఆకట్టుకున్నాయి. కొత్త వస్త్రాలు ధరించి పిండి వంటలు దేవుళ్లకు నైవేద్యాలు సమర్పించి పూజలు నిర్వహించి మంగళ హారతి ఇచ్చారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కలిసి కట్టుగా కాలానిలలో సంబరాలు జరుపుకున్నారు.