మంత్రాలయం లో ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు
1 min readఉత్తర ద్వారం లో వచ్చి వైకుంఠ ఏకాదశి ప్రారంభించిన శ్రీ మఠం పీఠాధిపతులు శ్రీ సుభుధేంద్ర తీర్థులు
భారిగా తరలి వచ్చిన భక్తులు
పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం : ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠానికి అనుసంధానం అయినా పాత ఊరిలో ని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ మఠం పీఠాధిపతులు శ్రీ సుభుధేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో వైకుంఠఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ముందుగా శ్రీమఠం పీఠాధిపతులు ఉత్తర ద్వారానికి పూజలు నిర్వహించి ఉత్తర ద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించి శ్రీ వెంకటేశ్వర స్వామి కి ధూపదీప నివేదనల సమర్పించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. వైకుంఠ ఏకాదశి కావడంతో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ప్రత్యేక పుష్పాలతో అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ఉత్తర ద్వారం గుండా ప్రవేశించి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు, మఠం సిబ్బంది పాల్గొన్నారు.