PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా వేళాంగణి మాత తిరుణాల మహోత్సవం..

1 min read

ముఖ్య అతిథిగా హాజరైన కర్నూలు మేత్రాసన కాపరి: గోరంట్ల జ్వాన్నేసు

ప్రార్థనల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ఆర్థర్.

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు (నందికొట్కూరు): నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో కర్నూలు రహదారిలో ఉన్న ఆర్.సి.యం చర్చి ప్రాంగణంలో శుక్రవారం సా.జరిగిన వేళాంగణి మాత తిరుణాల మహోత్సవ వేడుకలు విచారణ గురువులు ఫాదర్ కేడి జోసఫ్ ఆధ్వర్యంలో  అంగరంగ వైభవంగా జరిగాయి.ఈనెల 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు అనుదిన ప్రార్థనా కార్యక్రమాలు జరిగాయి శుక్రవారం చివరి రోజున ఉదయం నుంచి భక్తులు,మహిళలు పిల్లలు గుడి దగ్గరికి చేరుకుంటూ టెంకాయలు కొడుతూ క్రొవొత్తులు వెలిగిస్తూ మొక్కుబడులు తీర్చుకున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కర్నూలు మేత్రాసన కాపరి శ్రీశ్రీశ్రీ గోరంట్ల జ్వాన్నేసు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.6:30 కు స్థానిక ఆర్టీసీ కొత్త బస్టాండ్ నుంచి భారీ ఊరేగింపు నడుమ ఆయనకు ఘన స్వాగతం పలికారు.కర్నూలు బిషప్ గోరంట్ల జ్వాన్నేసు గారు దివ్య బలి పూజను సమర్పించారు. దివ్య బలి పూజ సందర్భంగా బిషప్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మే 10వ తేదీన ఇక్కడ ఈ ప్రాంగణంలో వెలసిన మరియతల్లిని దర్శించుకుంటూ మీకు ఉన్నటువంటి సమస్యలు బాధలు తదితరవాడని మరి తల్లికి సమర్పిస్తూ ఉన్నారు మీ సమస్యలు నెరవేరటం వల్లే ఎంతో మంది భక్తాదులు ఇక్కడికి వస్తున్నారు నాకు చాలా సంతోషంగా ఉంది. మనం కూడా జీవితంలో నిరాశకు గురవుతూ ఉంటాం. విశ్వాసంతో ప్రార్ధించినప్పుడు మన మోరను దేవుడు ఆలకిస్తాడు.మనకు ఉన్న సమస్యలు మరియతల్లి ముందు ఉంచితే మన కొరకు మరియతల్లి మన తరఫున దేవున్ని ప్రార్థిస్తారని మరియమాత ప్రార్థనల ద్వారా మీ కుటుంబంలో శాంతి సమాధానాలు అద్భుతాలు మీ కోరికలు నెరవేరుతాయని దేవుని పట్ల భయభక్తి విశ్వాసం అనేది తప్పనిసరిగా ఉండాలని ఆయన వాక్య పరిచర్య చేశారు.ఈ ప్రార్థనలో మొదటి నుంచి నందికొట్కూరు ఎమ్మెల్యే తోగూరు ఆర్థర్ ప్రార్థనలో పాల్గొన్నారు. అనంతరం బిషప్ గారిని ఎమ్మెల్యే శాలువాలతో సన్మానించారు.విచారణ గురువులు తదితరులు బిషప్ ని శాలువాలు పూల మాలలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో విచారణ గురువులు ఫాదర్ కేడి జోసఫ్, ఎల్.బాల యేసు,జీవసుధ పాస్టరల్ సెంటర్ డైరెక్టర్ ఫాదర్ బాలరాజు,కేడిఎస్ఎస్ డైరెక్టర్ ఫాదర్ సుధాకర్,గురువులు ఆంథోని రాజ్,లహస్త్రయ, రాజశేఖర్,అజీస్ తదితర గురువులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తాదులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

About Author