మండల ప్రజా పరిషత్ నిధులతో గ్రావెల్ రోడ్డు
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద: హొళగుంద మండలంలోని గ్రామ పెద్దల సహాయ సహకారంతో మండల ప్రజా పరిషత్ నిధులతో అగ్రహారం హనుమప్ప గుడినుండి ఎల్ఎల్సి కాల్వ వరకూ గ్రావెల్ రోడ్డు వేయడం జరుగుతుంది ఇంతకుముందు రోడ్డు చాలా అధ్వానంగా ఉందని పొలానికి వెళ్లే రైతులు మరియు గుడికి వెళ్లే భక్తులు మరియు గ్రామ ప్రజలు ఎంపీపీ, ఎంపీటీసీ, దృష్టికి తీసుకెళ్లడం జరిగినది. ఆయన వెంటనే స్పందిస్తూ మండల ప్రజా పరిషత్ నిధుల నుండి మూడు కిలోమీటర్ల మేరకు గ్రావెల్ వేయడం జరిగినది . ఈ కార్యక్రమములో గ్రామ పెద్దలు మరియు నాయకులు,ఎంపీపీ తనయుడు ఈసా. పంపాపతి, ఎర్రి స్వామి, దిద్ది వెంకటేష్, కృష్ణయ్య,ఎంపీటీసీ మల్లయ్య, కన్నయ్య, మరియు గుడి భక్తులు పాల్గొన్నారు.