PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గ్రేట్ ఫుల్ గిఫ్ట్స్ సొసైటీ ప్రధమ ఆవిర్భవ దినోత్సవ వేడుకలు

1 min read

ఆవిష్కరించి ఆశీర్వదించిన ఆర్ సి ఎం వికార్ జనరల్  రె:ఫాదర్ పి బాల

అన్ని వర్గాల వారికి సేవా దృక్పథంతో సేవలందించడమే ఈ సొసైటీ లక్ష్యం కావాలి

వైసిపి ఏలూరు నియోజకవర్గం ఇంచార్జ్ జయప్రకాష్ (జెపి)

పాల్గొన్న జిల్లా సంఘ సొసైటీ సభ్యులు,దైవజనులు, ప్రాంతీయ ప్రముఖులు

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఏలూరు జిల్లాలో గ్రేట్ ఫుల్ గిఫ్ట్ సొసైటీ ప్రథమ ఆర్భవ దినోత్సవ వేడుకలు శుక్రవారం స్థానిక 28వ డివిజన్ లోటస్ నగర్  సెయింట్ ఆంతోని  స్కూల్ రోడ్డులో ఆవిర్భావ వేడుకలు గ్రేట్ ఫుల్ గిఫ్ట్ సొసైటీ వ్యవస్థాప అధ్యక్షులు సోంగ మధు ఆధ్వర్యంలో  ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన వారిని శాలువా కప్పి పూల బొకేలు అందించి ఘనంగా సత్కరించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏలూరు పీఠం ఆర్.సి.యం వికార్ జనరల్ మరియు బిఈడి కాలేజ్ కరస్పాండెంట్  ఫాదర్ పి బాల మాట్లాడుతూ అన్ని వర్గాల వారికి సాంఘిక న్యాయం సమానత్వం, విద్య, వైద్య ఆరోగ్యం ప్రథమ లక్ష్యంగా సంస్థ పనిచేయాలన్నారు. ఏలూరు నియోజకవర్గం వైసీపీ ఇంచార్జ్ మామిళ్ళపల్లి జయ ప్రకాష్ (జెపి) మాట్లాడుతూ వృద్ధులకు, వితంతువులకు, నిరాశ్రయులైన వారికి ఈ సేవా ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో మరింత విస్తృతం చేసి పదిమందికి ఉపయోగపడే విధంగా అనేక కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఇటువంటి సేవా కార్యక్రమాలకు తాను అండగా ఉంటానని తన వంతు సహాయం అన్ని విధాలుగా అందించి సహకరిస్తానన్నారు. మహిళలకు చీరలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ నెరుసు చిరంజీ, మాజీ కార్పొరేటర్ కిలాడి దుర్గారావు, ఎస్సీ, ఎస్టీ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు మాముడూరి  మహంకాళి, చర్మకారుల సంఘం జాతీయ అధ్యక్షులు పొలిమేర హరికృష్ణ, సంఘ సహాయ కార్యదర్శి యర్రా జయదాస్, సభ్యులు మరియు వృద్ధ, వితంతు మహిళలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ప్రేమ విందును ఏర్పాటుచేశారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *