జనసేన పార్టీ ఇన్ చార్జ్ బి లక్ష్మన్న కు ఘన సన్మానం
1 min readపల్లెవెలుగు వెబ్ మంత్రాలయం: మంత్రాలయం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ చార్జ్ బి లక్ష్మన్న కు జన సైనికులు ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలు సందర్భంగా పూలదండలు, శాలువ కప్పి ఘనంగా సన్మానించారు. బుధవారం నియోజకవర్గ కేంద్రమైన మంత్రాలయం లో లక్ష్మన్న నివాసంలో నూతన సంవత్సర వేడుకలు పురస్కరించుకుని కేకు కట్ చేసి ఒకరినొకరిని తిని పించుకుని సంబరాలు జరుపుకున్నారు. 2025 నూతన సంవత్సరం సందర్భంగా, నియోజకవర్గంలోని జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి నూతన సంవత్సరం తియ్యటి వేడుకలు ఘనంగా జరుపుకుని , ప్రజలకు, నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు. అంతకు ముందు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు పూలమాలలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో బదినే హాల్ గ్రామం కౌతాళం మండల నాయకులు చిన్న , వై నాగేష్ , విద్య కమిటీ చైర్మన్ గోవింద్ , ఎర్రి స్వామి పెద్దకడుబూరు మండల నాయకులు జి బజార్ ప్రభుదాస్ , శ్రీను మల్లికార్జున , చిన్న కడుబూరు గ్రామం నుంచి మండల నాయకులు మా దేవా గోపాల్ , మంత్రాలయం మండల నుంచి రామకృష్ణ వన్నూర్, గిడ్డయ్య , మరియు ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.