ఎస్ ఎస్ ఎన్ కి ఘన సన్మానం
1 min read41 సంవత్సరాలు గా ఉపాధ్యాయవృత్తి
పిఆర్ టియు సంఘ సేవకు విశేష కృషి..
అందరికీ అజాతశత్రువు గా మారు పేరు
ముఖ్య అతిథులుగా ఎంఈఓ ఆర్ రంగయ్య , పిఆర్ టియు జిల్లా అధ్యక్షులు పువ్వుల ఆంజనేయులు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : 41 సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిలో మరియు 36 సంవత్సరాలుపాటు ఏకంగా ఏలూరు మండలంలోనే పనిచేసి రికార్డు సృష్టించారు. ఆయా పాఠశాలల అభివృద్ధికి, విద్యార్థుల భవిష్యత్తుకి ఆయన పునాదులు వేశారు. పాఠశాల అనంతరం మండల ఆఫీస్ లోనే ఉండి తోటి ఉపాధ్యాయుల సర్వీస్ మ్యాటర్స్ ని ఇన్నేళ్లుగా చూస్తుండటం, వారికి తగిన సహాయం చేయడం ద్వారా వారి సేవకి, పిఆర్ టియు సంఘ కార్యకలాపాలకు అంకితమై అజాతశత్రువుగా అందరివాడుగా వెలుగొందరూ అన్నారు, ఏప్రిల్ 30 కి పదవీ విరమణ చేయబోతున్న ఏలూరు మండలం జాలిపూడి అప్పర్ ప్రైమరీ. పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు పిఆర్ టియు జిల్లా ఉపాధ్యక్షులు ఎస్.సత్యనారాయణ(SSN) తో పాటు వారి సతీమణి సీతామహాలక్ష్మి కి బుధవారం పాఠశాల స్థాయిలో సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఎంఈఓ ఆర్.రంగయ్య , జిల్లా అధ్యక్షులు పువ్వుల ఆంజనేయులు,కాంప్లెక్స్ చైర్ పర్సన్ ఎస్.వెంకటలక్ష్మి , ఎన్.సునంద,సీనియర్ జర్నలిస్టు నాని,సిఆర్ పి సునీత, పాఠశాలకు తదుపరి హెచ్ఎం ఎస్.బ్రహ్మాజీ, వి.ప్రసన్న కుమార్, ఎస్.శిరీష, కె.అనంతలక్ష్మి, జీ.విజయశ్రీ , ఎం.శేషుకుమార్,డి. గణేష్ పాల్గొని వారి గొప్పతనాన్ని,పాఠశాలకు,విద్యార్థులకు,తోటి ఉపాధ్యాయులకు అందించిన సేవలను విశేషంగా కొనియాడారు.