PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన

1 min read

పల్లెవెలుగు వెబ్ ప్యాపిలి: రాచర్ల ప్రియా సిమెంట్ యాజమాన్యం ఆధ్వర్యంలో శనివారం  ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రియా సిమెంట్ కర్మాగారం యాజమాన్యం నిర్వహించారు.ఈ ఉచిత మెగా వైద్యశిబిరం నికి హైదరాబాద్ లోని యశోద హాస్పిటల్ నుంచి 25 మంది డాక్టర్ల సిబ్బందితో పేద ప్రజలకు వైద్య సేవ లు అందించారు. ఈసందర్భంగాప్యాపిలి మండల పరిధిలోని బోయిన్చెర్వుపల్లె, రాచర్ల, లక్ష్మితాండ, నేరుడుచెర్ల, కొమ్మెమర్రి, మర్రికుంటతాండ, సీతమ్మతాండ, బూరుగల, గార్లదిన్నె, అలేబాదాండ, అలేబాద్ గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకున్నారు. వైద్య శిబిరానికి వచ్చే వారికి ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తు, భోజన సౌకర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రియా సిమెంట్ కర్మాగారం ఆర్ వో కోటేశ్వరరావు, సాంబశివరావు మరియు కర్మాగారం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *