PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జాతిపిత మహాత్మా గాంధీకి ఘనమైన నివాళులు

1 min read

రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్

పల్లెవెలుగు వెబ్ నంద్యాల: జాతిపిత మహాత్మా గాంధీ అహింసా మార్గాన్ని అవలంబించి దేశానికి స్వాతంత్రాన్ని సముపార్జించిన మహోన్నత వ్యక్తి  అని రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. బుధవారం మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా రాష్ట్ర న్యాయ,  మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా, ఎమ్మెల్సీ ఇషాక్ బాషా, మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నిసా, డిఆర్ఓ ఎ. పద్మజ, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు తదితరులు నంద్యాల పట్టణం గాంధీ చౌక్ లోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ కులాలు, మతాలు అన్ని పార్టీలకు అతీతంగా నేడు మహాత్మా గాంధీ జన్మదినాన్ని జరుపుకుంటున్నామన్నారు. జాతిపిత ఆదర్శాలను ఆదర్శంగా తీసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలను అమలు చేస్తూ.. దేశాన్ని, రాష్ట్రాన్ని స్వచ్ఛంగా ఉంచేందుకు కృషి చేస్తున్నారని, పౌరులందరూ కూడా స్వచ్ఛత కార్యక్రమాలలో భాగస్వాములై స్వచ్ఛ పట్టణాలు, గ్రామాలుగా తీర్చిదిద్దుకోవాలని మంత్రి ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి, వివిధ జిల్లా అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

About Author