PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గ్రీన్ కో ప్రాజెక్ట్ చంద్రబాబు విజన్ కు నిజమైన నిదర్శనం.. రాష్ట్ర మంత్రి

1 min read

2018లోనే ప్రాజెక్టు పెట్టేందుకు ఎంవోయూ కుదిరింది

గ్రీన్ కో ప్రాజెక్టు విషయంలో వైసీపీ ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు పెట్టింది.. మంత్రి టీజీ భరత్

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూల్ జిల్లాలోని ఓర్వకల్లు మండలం పిన్నాపురం దగ్గర నిర్మించిన గ్రీన్ కో ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టు దేశానికే తలమానికమని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్  చెప్పారు. ఈ మేరకు మంత్రి ఒక ప్రకటన ద్వారా వివరాలు తెలిపారు. ఈ ప్రాజెక్టును 2014లో తమ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయనకున్న ముందు చూపుతో రాష్ట్రానికి తీసుకువచ్చారని తెలిపారు. 2018లో గ్రీన్ కో ఎనర్జీస్ ప్రైవేట్ లిమిటెడ్.. రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకుందన్నారు. సీఎం చంద్రబాబు గారి విజన్ కు ఈ ప్రాజెక్టు ఒక నిదర్శనం అన్నారు.అయితే ఇప్పుడు కొందరు వ్యక్తులు ఈ ప్రాజెక్టు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విజన్ అని చెప్పడం తనకు ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు. నిజం చెప్పాలంటే గత వైసీపీ గవర్నమెంట్ ఈ ప్రాజెక్టు విషయంలో ఎన్నో ఇబ్బందులు సృష్టించిందన్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన పలు అనుమతులు ఇచ్చేందుకు వైసీపీ ప్రభుత్వం ఎంతో జాప్యం చేసిందన్నారు. గ్రీన్ కో ప్రాజెక్టును సరైన విధంగా ముందుకు తీసుకువెళ్లాలన్న ఆలోచన కూడా వైసీపీకి లేదన్నారు. ప్రజలందరికీ వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందని మంత్రి టీజీ భరత్ అన్నారు. అప్పటి జీవో కాపీని చూస్తే విషయం అందరికీ తెలుస్తుందన్నారు. 2018లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే గ్రీన్ కో ప్రాజెక్టుకు అడుగులు పడ్డాయన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *