PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఫిర్యాదులు పునరావృతం కాకుండా చట్ట పరిధిలో పరిష్కరించాలి

1 min read

జిల్లా ఎస్పీ.  అధిరాజ్ సింగ్ రాణా

పల్లెవెలుగు వెబ్ నంద్యాల:  నంద్యాల జిల్లా బొమ్మల సత్రం వద్ద గల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం (29-07-2024) నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (P.G.R.S) కార్యక్రమంలో నంద్యాల జిల్లా ఎస్పీ  అధిరాజ్ సింగ్ రాణా IPS  ఫిర్యాదిదారుల నుంచి 110  ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుండి విచ్చేసిన ఫిర్యాదిదారుల సమస్యలను జిల్లా ఎస్పీ   అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులతో  స్వయంగా ఫోన్ లో మాట్లాడి చట్టపరిధిలో ఫిర్యాదిదారుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు.చట్ట పరిధిలో చట్టపరంగా ఉన్న సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని , ఫిర్యాదులను మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలని , ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యం గా వ్యవహరించరాదని సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్ లో  మాట్లాడి పరిష్కారం చూపాలని ఆదేశించారు. ఈ “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక”  కార్యాక్రమంలో సివిల్ తగాదాలు,కుటుంబ కలహాలు,అన్నదమ్ముల ఆస్థి పంపకాలలో మనస్పర్దలు  మొదలగునవి ఉన్నాయి. ఫిర్యాదులలో కొన్ని మా ఇంటికి వెళ్లేదారికి మరియు  అందరూ నడిచే దారిలో బండలు అడ్డంపెట్టి ,గోడ కట్టి మమ్మల్ని సుబ్రహ్మణ్యం ప్రతాప్ రాజశేఖర్ శ్రీనివాసులు శివయ్య శంకర్ వారి కుటుంబ సభ్యులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారని నాకు న్యాయం చేయండని శిరివెళ్ల గ్రామానికి చెందిన B. సంటెన్న జిల్లా ఎస్పీ కి ఫిర్యాదు చేశారు.కొంతకాలంగా శివరామి అనే వ్యక్తి నాకు పరిచయం ఏర్పడినాడు.ఒకరోజు నా కారును బయటికి తీసుకువెళ్తాను అని చెప్పి తీసుకుని వెళ్లి 30 రోజులు అవుతున్న తీసుకొని రాలేదు నా కారుకు ఉన్న కార్ ట్రాకర్ ను బాపట్లలో తొలగించినట్లు చివరి లొకేషన్ చూపిస్తుంది. నా వెహికల్ ఎక్కడ ఉందో తెలియడం లేదు అతని వద్దనుండి నా కారు ఇప్పించి నాకు న్యాయం చేయండని నంద్యాల టౌన్ అయ్యాలూరుకు చెందిన మీరా దినేష్ రెడ్డి జిల్లా ఎస్పీ కి ఫిర్యాదు చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తో పాటు స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రవీంద్రపాల్గొన్నారు.

About Author