మొక్కలు పెంచండి… పర్యావరణాన్ని కాపాడండి
1 min readపల్లెవెలుగు వెబ్ మహానంది: మొక్కలు పెంచండి… పర్యావరణాన్ని కాపాడండి అని నంద్యాల డిఎఫ్ఓ అనురాగ్ మీనా శుక్రవారం పిలుపునిచ్చారు. మండలంలో ఆదర్శ పాఠశాలలో వన మహోత్సవంలో భాగంగా విద్యార్థినీ విద్యార్థులు చేత మొక్కలను నాటించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఇంటి వద్ద, పాఠశాలల చుట్టుపక్కల, పొలాల వద్ద, ఖాళీ స్థలాల్లో, రోడ్ల వెంట మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని విద్యార్థిని విద్యార్థులకు సూచించారు. మొక్కలు నాటడం వల్ల కాలుష్యం తగ్గడంతో పాటు వర్షాలు విరివిగా పడి పాడి పంటలతో అందరూ సుఖ సంతోషాలతో జీవిస్తారన్నారు. మనము ఏవైనా రోగాల బారిన పడినప్పుడు ఆక్సిజన్ ను సిలిండర్ల ద్వారా కృత్రిమంగా డాక్టర్లు రోగులకు అందజేస్తారని దానికి కొంత డబ్బు ఖర్చవుతుందని కానీ మొక్కలు పెంచడం వల్ల సహజంగానే ప్రకృతి వరప్రసాదంగా అందరం ఉచితంగా స్వచ్ఛమైన ఆక్సిజన్ ను పొందవచ్చు అన్నారు. ప్రతి ఒక్కరు విద్యార్థి దశ నుండే మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని డీఎఫ్ఓ అనురాగ్ మీనా సూచించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మణ్ రావు రేంజర్ దినేష్ కుమార్ రెడ్డి డిఆర్ఓ హైమావతి కళాశాల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.