పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు పెంచండి
1 min readపల్లెవెలుగు వెబ్ చెన్నూరు : ప్రస్తుత వాతావరణంలో పెరుగుతున్నటువంటి కాలుష్యాన్ని నిర్మూలించేందుకు మరియు పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరుమొక్కలు పెంచండి తమ వంతు బాధ్యతగా తీసుకోవాలని మదర్ థెరిసా ఫౌండర్ విజయ్ కుమార్ అన్నారు. జిబి విఎస్ ది రిజర్వేషన్ సేవా సమితి ఆధ్వర్యంలో చెన్నూరు పెన్నా నది సమీపంలోని ఆంజనేయ పురం గ్రామంలో గురువారం మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారుఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లె ప్రాంతంలోనే కాకుండా పట్టణ పరిసరాల్లో విద్యాసంస్థల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో మొక్కల పెంపకాన్ని చేపట్టాలని సూచించారు ఈ కార్యక్రమంలో భాగంగా జిఏపీవీఎస్ ది రిజర్వేషన్ సేవా సమితి వ్యవస్థాపకుడు మరియు ఎన్ఎస్ఎస్ వాలంటీర్ అయిన అశోక్ కుమార్ మాట్లాడుతూ ఈ విధంగా పర్యావరణ దెబ్బతినకుండా ఉండేందుకు గాలిలో ఆక్సిజన్ శాతం తక్కువ అయితే రాబోయే రోజుల్లో మానవ మనగడకు ఇబ్బందులు ఎదురవుతాయని మరియు వాతావరణ సమస్యలతో దెబ్బ తినడం వలన సకాలంలో వర్షం పడడం లేదని ఇలాంటి విపత్తుల నుంచి బయట పడాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడంకై నడుము బిగించాలన్నారు .ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు మరియు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు విక్రమ్ శరణ్ తదితరులు పాల్గొన్నారు.