అంగన్వాడీ కేంద్రాల్లోనే చిన్నపిల్లల ఎదుగుదల:పీడీ
1 min readపల్లెవెలుగు వెబ్ మిడుతూరు (నందికొట్కూరు): అంగన్వాడీ కేంద్రాల్లోనే శారీరకంగా మానసికంగా ఎదుగుదల చిన్నపిల్లల్లో ఉంటుందని నంద్యాల జిల్లా అంగన్వాడీ ప్రాజెక్ట్ డైరెక్టర్ నిర్మల అన్నారు. మిడుతూరు మండలంలోని ఉప్పలదడియ గ్రామంలో అంగన్వాడి కేంద్రం దగ్గర ఏర్పాటు చేసిన ‘అంగన్ వాడీ బడిబాట’కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆమె హాజరయ్యారు.3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల వరకు అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలు ఉంటారని ఈ కేంద్రాల్లో అన్ని విధాలుగా ఆట పాటలతో పాటుగా పిల్లలకు కేంద్రాల్లో విద్య నేర్పించడం జరుగుతుందని అంతేకాకుండా కేంద్రాల్లో ఇచ్చే పోషకాహారం వల్ల పిల్లలు ఆరోగ్యకరంగా ఉంటారని ఆమె అన్నారు.ఈ కేంద్రాల్లో 5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా పిల్లలకు సర్టిఫికెట్లను అందజేశారు.తర్వాత వారిని మండల ప్రాథమిక పాఠశాలలో చేర్పించారు.ఈ కార్యక్రమంలో ఏసీడిపిఓ మంగవల్లి,సీడీపీఓ కోటేశ్వరమ్మ,అంగన్ వాడీ సూపర్ వైజర్లు వరలక్ష్మి, రేణుకాదేవి,పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మల్లికార్జున నాయక్, నాగరాజు,నాగమణి అంగన్వాడీ కార్యకర్తలు మరియు తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు.