కిడ్నాప్ కేసును 10 గంటల్లో చేధించిన గూడూరు పోలీసులు
1 min readఅభినందించిన … జిల్లా ఎస్పీ
కిడ్నాపర్ల నుంచి బంగారు వ్యాపారి వెంకటేశ్వర్లును గూడురు పోలీసులు రక్షించారు.
సోమవారం సాయంత్రం గూడూరు పోలీసు స్టేషన్ లో కిడ్నాప్ కేసు నమోదు కావడం జరిగింది.
మంగళవారం ఉదయమే చేధించారు.
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్ ఐపియస్ ఆదేశాల మేరకు 4 పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. కోడుమూరు సీఐ మన్సూరుద్దీన్, స్పెషల్ బ్రాంచ్ సిఐ నాగరాజ్ యాదవ్, గోనెగండ్ల సిఐ రామకృష్ణ, ఎమ్మిగనూరు టౌన్ సిఐ మధుసూధన్ రావు, కర్నూలు నాల్గవ పట్టణ సిఐ శంకరయ్య , సైబర్ సెల్ సిఐ శ్రీనివాసుల ఆధ్వర్యంలో గూడూరు, కోడుమూరు, కె. నాగలా పురం ఎస్సైలతో పాటు పోలీసు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు.సీసీ టీవీ పుటేజి, చరవాణి నంబర్ లోకేషన్ వంటి సాంకేతికను వినియోగించి కేసును ఛేదించారు. మంగళవారం ప్యాలకుర్తి సమీపంలో కిడ్నాపర్ల నుండి బంగారం వ్యాపారి వెంకటేశ్వర్లను రక్షించి , కుటంబ సభ్యులకు అప్పగిం చారు.కిడ్నాప్ కు గురైన బంగారం వ్యాపారి వెంకటేశ్వర్లు, గూడురు మండలం కు చెందిన బంగారం వ్యాపారస్తులు, గూడూరు ప్రజలు గురువారం జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందుమాధవ్ ఐపియస్ ని జిల్లా పోలీసు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి త్వరితగతిన చర్యలు తీసుకుని , కేసు ను చేధించి , ప్రాణాలు కాపాడినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. డబ్బుల కోసమే కిడ్నాప్ చేశారనే విషయం పై దర్యాప్తు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ పేర్కొన్నారు.కిడ్నాప్ కేసును చేధించిన పోలీసు అధికారులను, సిబ్బందిని జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్ ఐపియస్ గురువారం అభినందించారు. ఈ సంఘటనతో గూడురు మండలం కు చెందిన బంగారం వ్యాపారస్తులు, గూడూరు ప్రజలు శభాష్ పోలీసు అంటూ పోలీసుల పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.