PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గుంతకల్లో జీ తెలుగు తారల సందడి..

1 min read

మెగా ఈవెంట్ ముక్కుపుడక మహారాణి Vs మెగా జగద్ధాత్రి ఈ ఆదివారం మధ్యాహ్నం 1:30 గంటలకు! 

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: అశేషప్రేక్షకాదరణతో విజయవంతంగా కొనసాగుతున్న సీరియల్స్, ప్రత్యేకకార్యక్రమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న ఛానల్ జీ తెలుగు.  రెట్టింపు వినోదాన్ని ఎప్పటికప్పుడు ప్రత్యేకకార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లే జీ తెలుగు తాజాగా గుంతకల్ వేదికగా అభిమానులకుఅద్భుత అవకాశాన్ని అందించింది. జీ తెలుగు సీరియల్స్ ముక్కుపుడక, జగద్ధాత్రి, సూర్యకాంతం నటీనటులు తమ అభిమానులను నేరుగా కలిసేందుకు ఆత్మీయ సమ్మేళనకార్యక్రమాన్ని నిర్వహించింది. అభిమాన ప్రేక్షకుల మధ్య కోలాహలంగా జరిగినకార్యక్రమం ‘ముక్కుపుడక మహారాణి Vs మెగా జగద్ధాత్రి’ ఈఆదివారం, అక్టోబర్ 06న మధ్యాహ్నం 1:30 గంటలకు మీ జీ తెలుగులో.. తప్పక చూడండి!జీ తెలుగు ఇటీవల గుంతకల్లో ప్రముఖ నటీనటులతోకార్యక్రమాన్ని నిర్వహించి వీక్షకులకు ఆహ్లాదకరమైన అనుభవాన్ని అందించింది. ఈకార్యక్రమం ఆదివారం జీ తెలుగులో ప్రసారం కానుంది. ఎనర్జిటిక్ యాంకర్ లాస్య వ్యాఖ్యాతగావ్యవహరించిన ఈ కార్యక్రమం ఆద్యంతం ప్రేక్షకులకు వినోదం పంచింది. జీ తెలుగుప్రేక్షకులను మెప్పిస్తూ విజయవంతంగా కొనసాగుతున్న ముక్కుపుడక, జగద్ధాత్రి, సూర్యకాంతం సీరియల్స్ నటీనటులు ఈ వేదికపై నుంచి తమ అభిమానులతో సంభాషించి వారిసంతోషంలో పాలుపంచుకున్నారు. నటీనటుల అదిరిపోయే ఎంట్రీతో ఆరంభమైన కార్యక్రమంకోలాహలంగా సాగింది. నటీనటుల సరదా సంభాషణలు, ఆటపాటలతో ఈ కార్యక్రమం ఆద్యంతం వినోదంపంచింది. ఇక, ఎవర్గ్రీన్ సరిగమప గాయనీగాయకుల ప్రత్యేకప్రదర్శన వీక్షకుల హృదయాలను హత్తుకుంది.జీ తెలుగు తారలు, అభిమానులతో సంగ్రామంలా సాగిన ఈ కార్యక్రమానికిమహిళా క్రికెటర్ హరిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జగద్దాత్రి సీరియల్ టీమ్ హరితకుక్రికెట్ బ్యాట్ను బహుకరించి సన్మానించింది. డ్రామా జూనియర్స్ పిల్లలుఆకట్టుకునే స్కిట్లతో చేసిన అల్లరి అందరినీ కడుపుబ్బా నవ్వించింది.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *