PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గురువు సూర్యుడు వంటి వాడు 

1 min read

హెచ్.యం.భ్రమరాంబ.

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ : గురువు సూర్యుడు లాంటి వదని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు భ్రమరాంబ అన్నారు.గురువారం స్థానిక పత్తికొండ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో నేడు టీచర్స్ డే ను ఘనంగా నిర్వహించారు.మొదట పాఠ శాల ప్రధానోపాధ్యాయురాలు భ్రమరాంబ డాక్టర్ సర్వేపల్లి రాధా కృష్ణ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గురువు సూర్యుడు వంటి వాడు అని,తన జ్ఞాన వెలుగులతో మనల్ని నిత్యం ప్రకాశించేలా చేస్తాడని తెలిపారు.గురువులు పాఠాల తో పాటు గుణపాఠాలు,జీవిత పాఠాలు బోధిస్తారు అన్నారు.ప్రతిభను గుర్తించి శిక్షణ నిస్తార్కుఅదేవిధంగా తప్పును చేస్తే శిక్షిస్తారు అని తెలిపారు.అనుకున్నది సాధించడానికి ప్రోత్సహించేది కూడా గురువే అన్నారు.ఈ కార్యక్రమంలోపిల్లలు వారి గురువులకు సన్మానం చేశారు.అమ్మాయిలు అనేక సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో టీచర్లు,విద్యార్థినిలు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *