గురుకుల పాఠశాల టీచర్ అకాల మరణం..
1 min readకుటుంబాన్ని ఆదుకుంటాం:డీసీఓ
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండల కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బాలుర గురుకుల పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడి గా పని చేస్తున్న కే భాను ప్రకాష్(29) అకాల మరణం చెందారు.ఇదే పాఠశాలలో చదివిన భాను ప్రకాష్ ఇక్కడే ఉపాధ్యాయుడిగా పనిచేయడం హర్షించదగ్గ విషయం అంతలోనే మృతి చెందడం బాధాకరం.పాఠశాల సిబ్బంది తెలిపిన వివరాల మేరకు ఆదివారం తెల్లవారు జామున రెండు గంటల సమయంలో కర్నూల్ లోని వారి ఇంటిలో కాలుకు కాటు వేసిందని కుటుంబ సభ్యులకు తెలపడంతో వెంటనే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.అక్కడికి వెళ్లే లోపే భాను స్పృహ కోల్పోయాడు.ఉ 6 గం.కు మరణించినట్లు వారు తెలిపారు.కానీ కాలుకు ఎక్కడా కూడా కాటు అనవాళ్లు లేవని పోస్టుమార్టం లో మృతికి గల కారణాలు తెలియాల్సి ఉందని సిబ్బంది తెలిపారు.ప్రిన్సిపాల్ మరియు సిబ్బంది ఆస్పత్రి దగ్గరే ఉండి పోస్టుమార్టం పూర్తి చేయించారు.గురుకుల పాఠశాల ఉమ్మడి జిల్లా కో ఆర్డినేటర్ ఐ శ్రీదేవి మరియు పాఠశాల ప్రిన్సిపాల్ సత్య నారాయణమూర్తి,పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్ జయన్న మరియు పాఠశాల సిబ్బంది మృతుని ఇంటికి వెళ్లి భాను ప్రకాష్ కు నివాళులు అర్పించారు.జూపాడు బంగ్లా పాఠశాల సిబ్బంది తరపున మృతుని కుటుంబానికి ప్రిన్సిపాల్ సత్య నారాయణమూర్తి,కృష్ణుడు మరియు సిబ్బంది 20 వేల రూపాయలను అందజేశారు. 2020 ఫిబ్రవరిలో ఈ పాఠశాలలో ఉద్యోగంలో చేరారు.పేదరిక కుటుంబం గత 5 సం.ల క్రితం తండ్రి మరణించాడని ఇతని మీదనే కుటుంబం ఆధారపడి ఉందని అంతే కాకుండా పదోన్నతి వచ్చే సమయంలోనే మృతి చెందడం బాధాకరమని వారు తెలిపారు.ప్రభుత్వం నుండి వచ్చే సదుపాయాలను కుటుంబానికి వచ్చే విధంగా చేస్తామని డీసీఓ శ్రీదేవి తెలిపారు.భాను ప్రకాష్ కు తల్లి ఇద్దరు సోదరులు ఉన్నారు.ఇతనికి వివాహం కాలేదు.మృతి పట్ల పాఠశాల సిబ్బంది విద్యార్థులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.