శ్రీమఠం లో గురుపౌర్ణమి వేడుకలు
1 min readతులసి వనంలో మృత్తిక సంగ్రహణ పూజలు
మంత్రాలయం, పల్లెవెలుగు: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం లో పీఠాధిపతి శ్రీ సుభుదేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో గురుపౌర్ణమి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆషాడ శుద్ధ పూర్ణిమ సందర్భంగా మృత్తిక సంగ్రహణ మహోత్సవం ఈ పవిత్ర సందర్భంగా పెద్ద ఊరేగింపుగా తులసీవనాన్ని సందర్శించి మఠం, తుంగభద్ర నది మధ్య ఉన్న తులసీ వన (తోట) నుండి మృత్తికాను సేకరించారు. ఈ మృత్తికను సువర్ణ పల్లకిలో శ్రీ రాఘవేంద్ర స్వామిగలవారి సన్నిధానానికి తీసుకొచ్చి బృందావన శిఖరంపై ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా శ్రీ మఠం నుండి తులసి వనం వరకు భాజభజంత్రీల మధ్య, భక్తుల హర్షధ్వనుల మద్య ఊరేగింపు వెళ్లి మృత్తిక కు వేద పండితుల మంత్రచ్చరణల మధ్య పీఠాధిపతులు శ్రీ సుభుధేంద్ర తీర్థులు మంగళ హారతి ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మఠం మేనేజర్ ఎస్ కే శ్రీనివాస్ రావు, వెంకటేష్ జోషి, శ్రీపతి వ్యాసరాజ్, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.