PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘ జీవీఆర్’ కు పాతికేళ్లు..

1 min read

25 ఏళ్లుగా చిన్నారులకు వైద్య సేవలు అందించాం..

  • ఆధునిక టెక్నాలజీతో మరింత ముందుకెళ్తాం..
  • జీవీఆర్​ హాస్పిటల్​ ఎం.డి. ఎం. భువనేశ్వరి, చీఫ్​ కన్సల్టెంట్​ డా. జిఎస్​. రామ ప్రసాద్​
  • ఘనంగా జీవీఆర్​ సిల్వర్​ జూబ్లీ వేడుకలు

కర్నూలు, పల్లెవెలుగు:రాయలసీమ ప్రాంతం నుంచే కాక కర్ణాటక, తెలంగాణ ప్రాంతాల నుంచి వచ్చిన చిన్నారులకు విశిష్ట వైద్య సేవలు అందించి ప్రజా మన్ననలు పొందిన జీవీఆర్​ చిల్ర్డన్​ హాస్పిటల్​ కు పాతికేళ్లు నిండాయని  చెప్పేందుకు సంతోషిస్తున్నామన్నారు జీవీఆర్​ హాస్పిటల్​ ఎం.డి. , పిల్లల వైద్య నిపుణులు డా. ఎం. భువనేశ్వరి, చీఫ్​ కన్సల్టెంట్​ డా. జిఎస్​. రామ ప్రసాద్​.  జీవీఆర్​ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మంగళవారం హాస్పిటల్​లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.  అత్యంత ఆధునాతన వైద్య సాంతికేక పరిజ్ఞానంత నగరంలో నెలకొల్పిన తొలి లెవల్​ –3 నియోనేటల్​ ​ సెంటర్​గా పేరొందింది. లండన్​ హాస్పిటల్​ డిజైన్​తో నెలకొల్పిన నియోనేటల్​ సెంటర్​ ఇప్పటికీ అనేక పురిటి బిడ్డలకు, పిల్లలకు ప్రాణధారంగా నిలిచి  సేవలందిస్తోందన్నాన్నారు. తమ తమ పిల్లలు డా.జిబి. మేఘన ఎండి డెర్మటాలజిస్ట్​ డా. సుధీప్​ గడ్డం ఎండి పీడియాట్రిక్స్​ చేసి మరింత ఉన్నత చదువుల్లో భాగంగా డిఎం అంకాలజీ చేస్తున్నారని వెల్లడించారు. జీవీఆర్​ హాస్పిటల్​లో పేదలకు ఉచితంగ  వైద్య సేవలు అందించడానికి ఆరోగ్యశ్రీ సదుపాయం , ప్రభుత్వ ఉద్యోగులకు, జర్నలిస్టులకు ఈహెచ్​ ఎస్​, ఈడబ్ల్యూ ఎస్​ వంటి వైద్య భీమా సదుపాయాలు ఉన్నాయని ఈ సందర్భంగా హాస్పిటల్​ ఎండి డా. భువనేశ్వరి, డా. రామ ప్రసాద్​ వెల్లడించారు.

  • జీవీఆర్​ హెల్త్​ బేబీ పోటీలు

జీవీఆర్ సిల్వర్​ జూబ్లీ వేడుకల్లో భాగంగా  జీవీఆర్​ హెల్త్​ బేబీ పోటీలు నిర్వహిస్తున్నట్లు జీవీఆర్​ హాస్పిటల్​ ఎం.డి. ఎం. భువనేశ్వరి, చీఫ్​ కన్సల్టెంట్​ డా. జిఎస్​. రామ ప్రసాద్​ తెలిపారు.   పోటీలకు ఈ నెల 14 నుంచి  సెప్టెంబరు 14 వరకు  రిజిస్ర్టేషన్లు చేయించుకోవాలని, 0–12 నెలలు ఒక కేటగిరి,  ఒకటి నుంచి మూడేళ్లలోపు చిన్నారులకు రెండో కేటగిరిలో పోటీలు నిర్వహిస్తామని, విజేతలకు  సెప్టెంబరు 17న రూ.25వేలు బహుమతులు అందజేస్తామన్నారు.  పోటీల్లో ప్రధానంగా బ్రెస్ట్​ ఫీడింగ్​ , హైట్​, వెయిట్​, హియరింగ్​, వ్యాక్సినేషన్​, కంగారు కేర్​ ( స్కిన్​ టు స్కిన్​ ) , జనరల్​ హెల్త్​ ను పిల్లల్లో చెక్​ చేయడం జరుగుతుందన్నారు. విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతోపాటు కన్సులేషన్​ బహుమతులు, బేబీలకు పార్టిసిపేషన్​  సర్టిఫికెట్లను , పోటీలను అందజేస్తామని స్పష్టం చేశారు.

About Author