PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శ్రీ మద్ది ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాద్ జయంతి

1 min read

పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు

మే 31 నుండి జూన్ 4వ తేదీ వరకు అత్యంత వైభవంగా కార్యక్రమాలు

కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : జంగారెడ్డిగూడెం మండలము, గురవాయిగూడెం గ్రామము నందు తెల్ల మద్ది చెట్టు క్రింద స్వయంభువులై వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయస్వామి వారి ఆలయంలో హనుమద్ జయంతి సహితా కళ్యాణ మహోత్సవములు 31.05.2024 శుక్ర వారము నుండి 04.06.2024 మంగళవారము వరకు అత్యంత వైభవముగా నిర్వహించబడునని, సదరు కార్యక్రమములలో భాగముగా  ది.31.05.2024వ తేదీ      శుక్రవారము ఉదయం గం.5-00 నుండి     శ్రీ స్వామి వారికి ప్రభాత సేవ, నిత్య అర్చన అనంతరం స్వామివారి నిజరూప దర్శనం, తదుపరి పూర్వాభాద్ర నక్షత్రము సందర్భముగా ఉదయం గం 9.15 లకు శ్రీ సువర్చలా హనుమద్ కళ్యాణం  నిర్వహించబడునని,  సాయంత్రం గం.6-00 లకు విశ్వక్సేనపూజ, పుణ్యహావచనం, దీక్షధారణ, మృత్సంగ్రాహణం, అంకురారోపణం, వాస్తుపూజ, యాగశాల ప్రవేశం, అగ్నిప్రతిష్ట,  ప్రధాన హోమలు,  ద్వజారోహణ, బలిహారములు నిర్వహించబడునని  కావున భక్తులు యావన్మంది విచ్చేసి సదరు పూజలలో పాల్గొని స్వామివారిని దర్శించి, తీర్ధప్రసాదాలు స్వీకరించి,  స్వామి కృపకు పాత్రులు కాగలరని  ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలిపారు.

About Author