మద్ది ఆంజనేయస్వామి వారి ఆలయంలో సువర్చలా హనుమద్ కళ్యాణం
1 min readఅత్యంత వైభవంగా జరుగుతున్న జయంతి కార్యక్రమాలు
ప్రత్యేక పూజలు,కిక్కిరిసిన భక్తులతో సందడిగా ఆలయ ప్రాంగణం
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం మండలము, గురవాయిగూడెం గ్రామము నందు తెల్ల మద్ది చెట్టు క్రింద స్వయంభువులై వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయస్వామి వారి ఆలయంలో హనుమద్ జయంతి సహితా కళ్యాణ మహోత్సవములు 31.05.2024 శుక్రవారము నుండి 04.06.2024 మంగళవారము వరకు అత్యంత వైభవముగా నిర్వహించబడుచున్నవి. సదరు కార్యక్రమములలో భాగముగా మూడవరోజు ది.02.06.2024వ తేదీ ఆదివారము ది.02.06.2024 వ తేదీ ఆదివారము ఉదయం 5.00 గం నుండి శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారికి ప్రభాత సేవ, నిత్య అర్చన.ఉదయం గం 8-00 నుండి నిత్య హోమము, బలిహరణ, అనంతరం ఆలయ మండపముపై ప్రత్యేక పూలతో అలంకరించిన వేదికపై శ్రీస్వామివారిని, అమ్మవార్లను ఆసీనులను చేసి, అర్చక స్వాములు శ్రీస్వామివారి కల్యాణ క్రతువు శాస్త్రోక్తంగా నిర్వహించినారు. సదరు కళ్యాణ క్రతువులో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆలయ సిబ్బంది భక్తులకు ప్రసాదములు అందజేసినారు. సాయంత్రం గం.6.00 నుండి గురవాయిగూడెం, కొంగువారిగూడెం గ్రామాలలో శ్రీ స్వామి వారి గ్రామోత్సవము అనంతరం నిత్య హోమము, బలిహరణలు నీరాజన మంత్ర పుష్పములు, ప్రసాద వితరణ నిర్వహించబడినవి.రేపు అనగా ది. 03.06.2024 వ తేదీ సోమవారము ఉదయం 5.00 గం నుండి ఆంజనేయ స్వామి వారికి ప్రభాతసేవ, నిత్యఅర్చన, నిత్య హోమము, బలిహరణ ఉదయం గం.9.00 లకు ఉపాలయం శ్రీ వేంకటేశ్వర స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవము, నీరాజన మంత్ర పుష్పములు సాయంత్రం గం.6.00 లకు సాయంకాల హోమములు మహాశాంతి హోమం బలిహరణలు నిర్వహించబడునని ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలిపారు.