మొండికోడు లో హనుమాన్ జయంతి వేడుకలు
1 min readపెద్ద ఎత్తున పాల్గొన్న చుట్టుపక్కల మండలాల గ్రామస్తులు
భక్తిశ్రద్ధలతో భక్తులు హనుమాన్ కి పూజలు
పర్యవేక్షించిన ఎంపీపీ పెన్మత్త శ్రీనివాసరాజు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఏలూరు మండలంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు ఏలూరు రూరల్:ఏలూరు మండలంలో హనుమాన్ జయంతి వేడుకలు భక్తి శ్రద్దలతో వైభవంగా సాగుతున్నాయి. శ్రీరామ నామస్మరణతో ఆలయ ప్రాంగణాలు మార్మోగుతు న్నాయి. ఉదయాన్నే హనుమాన్, రామాలయాలకు అధిక సంఖ్యలో పోటెత్తిన భక్తులు బజరంగబలికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఏలూరు మండలంలో మొండికోడులో 20అడుగుల ఆంజనేయుని నిలువెత్తు విగ్రహాన్ని దర్శించుకోవడానికి ఉదయాన్నే అధిక సంఖ్యలో భక్తులు పోటేత్తారు. లంక గ్రామాల నుంచి ప్రజలు తండపతండాలుగా తరలి వచ్చి బజరంగబలికి ప్రత్యేక పూజలు నిర్వ హిస్తున్నారు. ఏలూరు మండల పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసరాజు, సంతోషిమాత ఫీడ్స్, నీడ్స్ అధినేత శ్రీకాంత్ వర్మ, పెద్దింట్లమ్మ ఆక్వా అధినేత సంతోష్ వర్మ, సుధీర్ వర్మలు ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. మధ్యాహ్నం మహా అన్న సమారాధన నిర్వహిం చారు. మాదేపల్లి, కోటేశ్వరదుర్గ పురం, ప్రత్తికొల్లాంక, పైడిచింతపాడు ఆంజనేయ స్వామి క్షేత్రాల వద్ద రామనామ జపంతో మారుమోగుతోంది. ఇక్కడ పురష్కరించుకుని వేకువజామునే ఆంజనేయుడికి తిరుమంజనం, ద్రావిడ ప్రబంధ పారాయణం, పంచామృత అభిషేకం, సహస్ర నాగవల్లి అర్చన ప్రత్యేక పూజలు నిర్వహించారు.