పింఛన్ల పెంపుతో పేదల కళ్ళల్లో ఆనందం
1 min readనందికొట్కూరు ఎమ్మెల్యే
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెలలోపే ఎన్టీఆర్ భరోసా పింఛన్లను 3 వేల నుంచి 4 వేలకు పెంచడం వీటితోపాటు మరో మూడు నెలలు 3 వేలు కలిపి 7 వేలు పింఛన్లు గత నెలలోనే ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ అని అంతే కాకుండా పింఛన్లు పెంచడంతో ప్రతి పేదవారి కళల్లో ఆనందం చూస్తున్నామని నందికొట్కూరు శాసనసభ్యులు గిత్త జయసూర్య అన్నారు. గురువారం మధ్యాహ్నం పాములపాడు మండలం ఎర్రగూడూరు మరియు జూపాడుబంగ్లా మండలం తాటిపాడు గ్రామాల్లో పింఛన్లను లబ్ధిదారులకు ఎమ్మెల్యే పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో కన్వీనర్ వెంకటేశ్వర్లు యాదవ్, నాయకులు కృష్ణారెడ్డి, గోరెసాహెబ్,మన్సూర్,మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్,ప్రభాకర్ రెడ్డి,మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి, పాములపాడు హరినాథ్ రెడ్డి, రవీంద్రారెడ్డి,శంకర్ స్వామి అధికారులు పాల్గొన్నారు.